వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,=కుంచన పల్లి.
 ఇవాళ ఉదయమే టీ తాగటం అలవాటు చేసుకున్న వారు  ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు  అయితే టీ కాచేటప్పుడు గృహిణి తీసుకోవలసిన జాగ్రత్తలేమిటంటే  టీ కాయడానికి 4 గు నుంచి ఐదు నిమిషాలు మాత్రమే   మరిగించాలి  అంతకంటే ఎక్కువసేపు మరిగిస్తే స్లో పాయిజన్ గా మారొచ్చు అని నిపుణులు తెలియచేస్తున్నారు తెలియజేస్తున్నారు  ఎక్కువసేపు మరగడం వల్ల క్యాన్సర్ పరిమాణాన్ని పెంచుతుంది  దానితోపాటు శరీర పోషకాలు గ్రహించడంలో ఆటంకాలు కూడా కలిగిస్తుంది ఎసిడిటీ  రావడానికి అవకాశం ఉంది  మధ్య మధ్యలో కడుపునొప్పి కూడా వచ్చే  అవకాశం ఉంది  శరీరంలో ఐరన్ కాల్షియం లోపం తలెత్తుతుంది  కనుక  జాగ్రత్తగా ఇలాంటి లోపాలు జరగకుండా  టీ కాచేటప్పుడే నాలుగు గురించి ఐదు నిమిషాలు మాత్రమే మరిగించాలి అని శాస్త్రం చెప్తోంది.జీవితంలో అనేక సత్యాలను అనేక గ్రంథాలు మనకు రాసి ఇచ్చాయి  సత్యం వద ధర్మం చెరా లాంటి వాక్యాలు   చిరస్మరణీయం  నీతులు చెప్పడానికే తప్ప చేయడానికి కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు  కానీ దానిని అనుసరించిన వారు ఉంటే వారు పొందిన ఆనందం  వారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు మరెవరికి రావు  హరిశ్చంద్రుని కథ మనం తీసుకున్నట్లయితే  జీవితంలో అన్ని సుఖాలను అనుభవిస్తున్న మహారాజు  సత్య వాక్ పరిపాలకుడు  తాను చెప్పిన సత్యాన్ని నిలబెట్టుకోవడానికి  ఎన్ని కష్టాలు పడ్డాడు కధా రూపంలోనూ నాటక రూపంలోనూ  కావ్యాల లోనూ మనం చదివినదే  అలాగే శిబి చక్రవర్తి  త్యాగము అన్న గొప్ప శబ్దాన్ని తన జీవితంలో అనుసరించి  ఆచరించి పరమోత్తమమైన స్థితిని పొందాడు  అలాగే ధర్మరాజు  ధర్మాన్ని పాటించడంలో మేటి  తమ్ముడు తన వాడైనా ధర్మాన్ని ధర్మంగా చెప్పాలి అని లోకోక్తి.ఆ ధర్మాన్ని పాటించడం వల్ల ధర్మరాజు ఎలాంటి కీర్తి ప్రతిష్టలను పొందాడో మనందరికీ తెలుసు  పచ్చని ప్రకృతిని భగవత్ స్వరూపంగా  భావించి  పూజించాలని ఎన్ని కథలు వచ్చినా దానిని పాటిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు  అనసూయ సావిత్రి లాంటి పతివ్రత శిరోమణులందరూ పతి సేవయే ధర్మమని  దానిని మాటలలో కాకుండా చేతలలో చూపించి  సమాజానికి మార్గ దర్శకులయ్యారు  తల్లిదండ్రులను  భగవత్ స్వరూపంగా చూసి  సేవ చేయాలని  కార్యరూపంలో చూయించిన శ్రావణ కుమారుడు  ధన్యుడైన సంగతి మనకు తెలుసు  ఇలాంటి మహామహులందరూ వారి వారి శక్తి సామర్ధ్యాలను బట్టి అభిరుచులను బట్టి కొన్ని ధర్మాలు పాటించి  కీర్తిమంతులై శాశ్వత ఆనందం పొందారు  ఇవి చదవడంతో సరిపెట్టుకోకుండా  మనం కూడా ఆచరించి  ధర్మపదంలో ముందడుగు వేద్దాం.
=====================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు