సెల్ ఫోన్,ఇంటర్నెట్ వినియోగం కారణంగా లేఖా రచన క్రమక్రమంగా తగ్గిందని,ఉత్తరాలు వ్రాయడం వలన విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు,సృజనాత్మకత అంశాలు వికసిస్తాయని, ఉత్తరాల వలన ఆత్మీయ అనుబంధాలు పెంపొందించబడుతాయని, తెలుగు,హిందీ,ఆంగ్ల భాషల్లో విద్యార్థులు లేఖలు వ్రాయడం ఆనందంగా ఉందని అనంత సాగర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.జ్యోతి అన్నారు.బుధవారం రోజున పాఠశాల లో గరిపెళ్ళి ట్రస్ట్ - పత్తిపాక ఫౌండేషన్ సౌజన్యం తో ఉత్తరాలు రాద్దాం రండి కార్యక్రమం జరిగింది.ఇందులో 22 మంది విద్యార్థులు తమ స్నేహితులకు,బంధువులకు,గురువులకు తెలుగు,హిందీ,ఆంగ్ల భాషల్లో ఉత్తరాలు వ్రాసారు.అనంతరం ఆ ఉత్తరాలను పోస్ట్ చేసారు.ఈ కార్యక్రమ నిర్వాహకులు భైతి దుర్గయ్య,కోణం పర్శరాములు,ఉపాధ్యాయులు రామస్వామి,శ్రీదేవి,సమ్మయ్య లు పాల్గొన్నారు.
మూడు భాషల్లో ఉత్తరాలు వ్రాసిన విద్యార్థులు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి