త్రోవలో పక్కకు వెళ్లి ఒక చెట్టు మొదట్లో కూర్చుని ఆనందా నేను బాగా అలసిపోయాను నా సంఘాటిని (బౌద్ధ భిక్షువు లు ధరించే మూడు ఛీవరాల్లో భుజంపై నుండి కప్పుకునే వస్త్రం) నాలుగు మడతలుగా నేల మీద పరువు కూర్చోవాలనిపిస్తుంది అన్నాడు ఆనందుడు పరచిన బట్టపై బుద్ధుడు కూర్చొని ఆనందా దప్పికగా ఉంది కొంచెం నీళ్లు కావాలన్నాడు భగవాన్ ఇప్పుడే 500 బండ్లు నదిని దాటి వెళ్లడం వల్ల చక్రాల తాకిటకి నీరంతా బుడదమయమైంది ఎంతో దూరంలో లేదు ఆ నీళ్లు స్వచ్ఛంగా చల్లగా హాయిగా ఉంటాయి తథాగతులు ఆ నీటితో శరీరాన్ని కడుక్కొని చల్లబరచుకొని ఆ పైన నీటిని తాగవచ్చు అని బదులు ఇచ్చాడు ఆనందుడు రెండవసారి నీళ్లు అడిగిన బుద్ధునితో ఆనందుడు అదే సమాధానం చెప్పాడు మూడోసారి బుద్ధుడు అందరితో ఆనందా నాకు దప్పికగా ఉందని చెప్పాను కదా తాగడానికి నీళ్లు తీసుకురా అన్నాడు.అలాగే భగవాన్ అని చెప్పి ఆనందుడు ఒక పాత్ర తీసుకొని సెలయేరు దగ్గరికి వెళ్ళగా బాగా బురదగా ఉన్న నీరు కాస్త స్వచ్ఛంగా మారిపోయింది అది చూసి ఆనందుడు ఆశ్చర్యపోయాడు పాత్రతో నీళ్లను తీసుకొని బుద్ధుని వద్దకు వచ్చిన ఆనందుడు అక్కడ జరిగింది చెప్పి తథాగతుడు ఇక నీటిని తాగవచ్చు అని వేడుకున్నాడు తథాగతుడు నీటిని తాగి దప్పిక తీర్చుకున్నాడు ఆ సమయంలో కుసి నగరo నుంచి పావా వెళుతున్న ఆలారకాలముని శిష్యుడైన పుక్కుస అనే వ్యక్తి చెట్టు మొదట్లో సేదతీరుతున్న బుద్ధుని సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు భగవాన్ అనగారికులు ఐన వారు ఎంత ప్రశాంతంగా ఉంటారు ఇది అద్భుతం ఆశ్చర్యం ఒకసారి ఆలారకాలాముడు ప్రయాణిస్తున్నప్పుడు పగటిపూట విశ్రాంతి కోసం వారి ప్రక్కనున్న చెట్టు మొదట్లో కూర్చున్నాడు అప్పుడు ఆయన పక్కగా 500 బండ్లు వెళ్లాయి తర్వాత ఒక వ్యక్తి అలారకాలాము ని దగ్గరకొచ్చి అయ్యా ఇంతకుముందు 500 బండ్లు ఇటుగా వెళ్లాయి మీరు చూశారా అని ప్రశ్నించాడు చూడలేదు మిత్రమా అని జవాబు ఇచ్చాడు కాలాముడు.కనీసం వాటి శబ్దం కూడా మీకు వినపడలేదా అంటే లేదు మిత్రమా అన్నాడు లేదు మిత్రమా నేను నిద్రించలేదు అన్నాడు ఆ దేవునికి ప్రభువు మీరు చేతనంగా ఉన్నారా చేతనంగానే ఉన్నాను అన్నాడు ప్రభువు మీరు చేతనంగానే ఉన్నారు మెలకువ గానే ఉన్నారు అయినా మీ పక్కగుండా పోయిన 500 బళ్ళను చూడలేదు వాటి శబ్దాన్ని అయినా వినలేదు చూడండి మీ చీవరం చెంగు ఎంత మట్టి కొట్టుకుందో ఏమో మిత్రమా అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు ఇది అద్భుతం ఆశ్చర్యం ఇళ్లొదటి తీసుకున్న వారిలో ఎంత ప్రశాంతత మెలకువతో చేతనోల్లో ఉండి కూడా తన ప్రక్కనే పోయిన 500 చూడలేకపోవడం అవి వెళ్ళేటప్పుడు వచ్చిన శబ్దాన్ని వినకపోవడం నిజంగా ఆశ్చర్యమే అలారకాలాముని పట్ల గొప్ప విశ్వాసంతో గౌరవభావంతో వెళ్లిపోయాడు ఆ వ్యక్తి పుక్కసా మెలకువతో ఉండి తన పక్కనుంచి వెళ్లిన 500 బళ్ళను చూడకుండా వాటి శబ్దాన్ని కూడా వినని వ్యక్తి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని చూడని ఉరుముల శబ్దాన్ని వినని వ్యక్తి ఈ రెండు ఉదాహరణల్లో ఏది కఠినమైంది అని అనుకుంటున్నావు భగవాన్ 500 600 700 800 900 ఒక లెక్క దానికంటే మెలకువతో చేతనంగానూ ఉన్న వ్యక్తి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం గురించి తెలియక పోవడం ఉరుముల శబ్దం వినకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.
=====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి