భారతీయులు వాడే అనేక రకాల వంటింటి పోపు దినుసుల్లో వాము గింజలొకటి. వీటిని అనేక రకాల పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. వేస్తుంటారు. అలాగే పలు వంటకాల్లోనూ వామును ఎక్కువగా వినియోగిస్తారు. వాము చక్కని సువాసనను కలిగి ఉంటుంది. అలాగే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను కూడా వాము అందిస్తుంది.
వాముని సంస్కృతంలో దీప్యక అని, హిందీలో అజ వాన్ అని అంటారు. వాము మొక్క సువాసన కలిగి ఉంటుంది. పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ పువ్వులనుంచే విత్తులు వస్తాయి. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది. శూలలను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారి. దీని శాస్త్రీయ నామం ట్రాకీస్పెర్మమ్ కాప్టికమ్. వాము భారతీయులకు తెలిసిన గొప్ప ఓషధి. దీనిని భారతదేశమంతటా పండిస్తారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాష్ట్రాల్లో సాగుచేస్తారు. చలి వాతావరణంలో బాగా పెరుగుతుంది. ఇది తెల్లని పూలు కలిగిన చిన్న ఏక వార్షికపు మొక్క. దీని గింజల నుంచి సుగంధ తైలాన్ని డిస్టిలేషన్ విధానం ద్వారా వేరుపరచి థైమాల్‌గా మార్కెట్ చేస్తుంటారు. వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. సాధారణంగా వామును జంతికలు, మురుకులలో వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్ర లా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా, అది చేసే మేలు మాత్రం పెద్దదే. వాము మాత్రమే కాదు, వాము మొక్క ఆకులు కూడా మనకు అద్భుతంగా ఉపయోగపడతాయి. వాటితో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వాము ఆకులు తీసుకుని శుభ్రంగా కడగాలి. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో ముందుగా కడిగి పెట్టుకున్న వాము ఆకులను వేసి బాగా మరిగించి డికాషన్ తయారుచేసుకోవాలి. అందులో కొద్దిగా తేనె వేసి వేడిగా ఉండగానే తాగాలి. దీని వల్ల దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. వాము ఆకులతో తయారు చేసిన డికాషన్ ను తాగితే జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా అజీర్తి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారు వాము ఆకుల డికాషన్ రోజూ తాగితే ఫలితం ఉంటుంది. కొన్ని వాము ఆకులను తీసుకుని బాగా నలిపి వాసన చూస్తే ముక్కు దిబ్బడ పోతుంది. వికారంగా ఉన్నా ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. వాము ఆకుల డికాషన్ తాగడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత కలుగుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి