శివానందలహరి ;- కొప్పరపు తాయారు

శ్లో!! గళంతీ శంభో త్వచరిత సరితః కిల్బిష రజో
దళంతీ  ధీకుల్యాసరణిషు పతంతీ విజయ తామ్
దిశంతీ సంసారభ్రమణ పరితాపోప శమనం     
వసంతీ మఛ్ఛేతో హ్రద భువి శివానంద లరహరీ !!

భావం: శంభో శంకరా! నీ యొక్క చరిత్ర అనే మహానదుల నుండి ప్రవహిస్తూ  పాపములు అనే దుమ్మును అణచి వేయుచూ, బుద్ధి అనెడి పిల్ల కాలువను చేరి సంసార తాపాన్ని శాంతి పరుస్తూ నా హృదయమనెడి లో తుమడుగున పడిన (యీ) శివానందలహరికి విజయ మగు గాక !!!
                           ******
     
కామెంట్‌లు