ఆచార్య జయ శంకర్ సార్ నీ యాది మరవలేము - శిరందాస్ శ్రీనివాస్.
ఐదున్నర దశాబ్దాల అలుపెరుగని పోరు సల్పి
మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన 
ఉక్కు మనిషి
ఆచార్య కొత్తపల్లి జయ శంకర్ సార్..

తెలంగాణకు
అడుగడుగున జరుగుతున్న
అన్యాయాన్ని
ప్రశ్నిస్తూ.. ప్రభోదిస్తూ
ప్రజలను జాగృత పరచిన
ప్రజల మనిషి శ్రీ కొత్తపల్లి

పద్దెనిమిదవ యేటనే 
ఉరకులు వేసే ఉడుకు నెత్తురును
ఉద్యమ బాట పట్టించి
మహోన్నత ఉద్యమానికి
ఊపిరిలు ఊదిన ఉద్యమ కారుడు

ఎన్ని ఉన్నత సదువులు సదివినా
ఎన్ని పదవులు అలంకరించిన
ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన
నమ్మిన సిద్ధాంతం కోసం
జీవితాన్ని అంకితం చేసిన
మహ దొడ్డ మాస్టారు..

గాంధేయ సిద్దాంతం ద్వారనే
స్వరాష్ట్రం సిద్ధిస్తుందని అభిలషించి
ఆచరించి, అనుసరించమని
తెరాస కు తెరలేపిన తత్వ మూర్తి.
తెలంగాణ ఉద్యమానికి దిశా నిర్దేశ్యం చేసిన  మహానుభావుడు
తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి.

కుటిల పాలకుల దమన నీతికి
ఆందోళన చెంది
అన్యాయాన్ని ఆపలేక ఆవేదన చెంది.
ఆందోళనతో ఆరొందల పై చిలుకు
అమాయకులు
ఆత్మాహుతి జేసుకుంటే
అమర వీరుల ఆర్తనాదాలు 
వినలేక, కనలేక
నాటి ప్రభుత్వ హింసా మార్గాన్ని
సహించలేక
అసువులు బాసిన ఆచార్య శ్రీ కొత్తపల్లి ..
స్వరాష్ట్రం సిద్దించక ముందే 
కనిపించని తీరాలకు వెళ్ళినా
కోట్లాది ప్రజల గుండెల్లో 
చిరంజీవివై కొలువై ఉన్న కొత్తపల్లి.

తెలంగాణ చరిత్ర పుటల్లో
ఆయన అధ్యాయం చిరస్మరనీయం 
ఆయన త్యాగం, ఆయన భాష్యం
ఆయన భావం, ఆయన స్ఫూర్తి
సదా రగిలిస్తూనే ఉంటుంది..
కోట్లాది ప్రజల గుండెల్లో 
ఉద్యమ స్ఫూర్తిని. 

ఆయన  లేరన్న చేదు నిజం
నిలువెల్లా దహించి వేస్తుంది..
ఆయన స్వప్నం, ఆయన కల
సబ్బండ వర్గాల తెలంగాణ...
ఆ కల నిజమైన వేళ 
ఆయన లేని లోటు
తెలంగాణ ప్రజల
గుండెల పిండి వేస్తుంది.

ఏక శిలా నగరం శోక సంద్రమై 
లక్షలాది జనం జోహార్లు ఆర్పించిన 
ఆయన అంతిమ స్ఫూర్తి యాత్ర ..
అశ్రు నయనాలతో వీడ్కోలు
న భూతో న భవిష్యత్
చరిత్రలో ఓ అధ్భుత నివాళి..

వారు మన మధ్య లేకున్నా
ఆయన బోధనలు 
ఆయన శోధనలు 
సదా మార్గదర్శకం
ముందు తరాలకు మహోన్నతం..
ఓ మహా మనీషి, 
ఓ మంచి మాస్టారు
ఓ మార్గదర్శి
ఆయన చరిత్ర, ఆయన మార్గం, ఆయన బోధనలు
చరిత్రలో సువర్ణాక్షర లిఖితం
ఆయన కివే అశ్రు నివాళులు

🙏🙏🙏🙏
శిరందాస్ శ్రీనివాస్
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
హైదరాబాద్.
9441673339

కామెంట్‌లు