ఉదయాన్నే లేచిన బుద్ధుడు వైశాలికి భిక్షకు వెళ్ళాడు తిరిగి వచ్చి భోజనం చేసిన తర్వాత వైశాలి నగరం వైపు ఏనుగు వెనక్కు తిరిగి చూసినట్లు చూశాడు ఆనందా ఇదే వైశాలి నగరానికి తథాగతులు చివరి చూపు రా ఆనందా బంద గ్రామం వైపు వెళ్దాం అనడంతో సరే అన్న ఆనందుడు ఏర్పాటు చేశాడు బుద్ధుడు చూడండి ఆచరించిన శీలం సమాధి ప్రజ్ఞ విముక్తులను గురించి కేవలం తలుచుకుంటూ నే సరిపోదు వాటిని ఆచరించినప్పుడే భవ తృష్ణ అంతమై మళ్ళీ పుట్టుక లేని పరమోన్నత విముక్తి లభిస్తుంది అని బోథిoచాడు అలా బంద గ్రామంలో వారం రోజులు గడిపిన తర్వాత భిక్షు సంఘo తో బుద్ధుడు హల్ది గ్రామాలకు చేరుకున్నాడు అలాగే అంబ గ్రామం జంబు గ్రామాలను కూడా సందర్శించాడు.జంబు గ్రామము నుంచి బుద్ధుడు భిక్షు సంఘం వెంటరాగా భోగనగరం చేరుకున్నాడు మీకు నాలుగు అతి ముఖ్యమైన ప్రసంగాలను చేయాలనుకుంటున్నాను శ్రద్ధతో వినండి అన్నాడు ఒక భిక్షువు ఇలా చెప్పవచ్చు బుద్ధుని నోటి నుంచి వేరు వడిన దానిని నేను విన్నాను నాకు అది ధమ్మం నాకు అదే వినయం అదే బుద్ధుని బోధ అని లేక మరో భిక్షువు ఇలా చెప్పొచ్చు ఒకానొక విహారంలో పెద్దలు నాయకుడు గల భిక్షు సంఘం నోట్లో నుంచి వెలువడగా విన్నాను కాబట్టి నాకు అదే ధమ్మo నాకు అదే వినయం అదే బుద్ధుని బోధ అని ఇంకొక బిక్షువు అనుకోవచ్చు ఒకానొక విహారంలో జ్ఞాన సంపన్నులు బౌద్ధ సంప్రదాయాల్లో పండితులు తాము నేర్చుకున్న విషయాలను ధారణ గావించి తమ జ్ఞాపకంలో నుంచి వారి నోటితో చెప్పిన విషయాలను విన్నాను కాబట్టి నాకు అదే దమ్మo అదే వినయం అదే బుద్ధుని బోధ అని మరో భిక్షువు అలా అనవచ్చు.ఒకానొక విహారంలో స్తవీరుడు స్మృతిని వినయాన్ని ఇతర నియమాల్ని సంప్రదాయాల్ని బాగా నేర్చుకొని జ్ఞాపకం పెట్టుకుని చెప్పగా విన్నాను కాబట్టి నాకు అదే ధమ్మo అదే వినయంగా భావిస్తాను అని ఈ భిక్షువు ల్లో ఏ ఒక్కరి అభిప్రాయాన్ని మనం అంగీకరించకూడదు అలా అని తిరస్కరించరాదు కూడా వాటిని అంగీకరించకుండా తిరస్కరించకుండా వాటిలోని ప్రతి పదాల్ని అధ్యయనం చేసి వాటిని సూత్రాలతో కానీ వినయ నియమాలతో కానీ సరిచూసి అవి ఏకీభవించ నట్లయితే ఇవి బుద్ధుడు చెప్పిన మాటలు కావు సంఘం సభ్యులు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకోవాలి అందుచేత వాటిని తిరస్కరించాలి భిక్షువు చెప్పిన మాటలను సరి చూసుకొనినప్పుడు అవి సూత్రాలతోనూ వినయ నియమాలతోనూ సరిపోయినట్లయితే అవి తప్పక బుద్ధ వచనాలే అనే నిర్ణయానికి రావచ్చు.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి