ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది
-----------------------------------------------------------------
క్రొత్త వృత్తములు.
----------------------
61.
సరసి -మ, త, య.
నీ పాదంబుల్ పట్టితినయ్యా!
నా పాపంబుల్ కాల్చగ రావా!
కోపంబుల్ నీకేల?మురారీ!
తాపంబున్ దీర్చే హరి కృష్ణా!//
62.
అయనపతాక -మ, న, మ.
నేరంబుల్ కనకు శౌరీ సం
సారంబందు పడితిన్ స్వామీ!
భారంబుల్ గలిగె గోవిందా!
దారిన్ జూపవయ శ్రీకృష్ణా!//
63.
కాంసీకము /మకరలతా -మ, న, య.
శక్తిన్ గల్గగ నిను నే సం
రక్తిన్ పూజలు సలుపంగన్
భక్త్యాధీనుడవు మురారీ!
ముక్తిన్ నా కొసగుము కృష్ణా!//
64.
ధృతహాలా -మ, భ, మ.
జీవాత్మా!మాధవ!రావేలా?
కావంగా వేగమె శ్రీనాధా!
నీవే మానాయకు డంచున్ సం
భావింతున్ నా మదిలో కృష్ణా!//
65.
త్రిలోకగామీ -మ, ర, య.
శ్రీరంగా!శ్రీధరా!మురారీ!
ప్రారబ్ధంబుల్ దొలంగ భక్తిన్
జేరంగా నీ దరిన్ ప్రభూ!నీ
కారుణ్యంబున్ దలంతు కృష్ణా!//
-----------------------------------------------------------------
క్రొత్త వృత్తములు.
----------------------
61.
సరసి -మ, త, య.
నీ పాదంబుల్ పట్టితినయ్యా!
నా పాపంబుల్ కాల్చగ రావా!
కోపంబుల్ నీకేల?మురారీ!
తాపంబున్ దీర్చే హరి కృష్ణా!//
62.
అయనపతాక -మ, న, మ.
నేరంబుల్ కనకు శౌరీ సం
సారంబందు పడితిన్ స్వామీ!
భారంబుల్ గలిగె గోవిందా!
దారిన్ జూపవయ శ్రీకృష్ణా!//
63.
కాంసీకము /మకరలతా -మ, న, య.
శక్తిన్ గల్గగ నిను నే సం
రక్తిన్ పూజలు సలుపంగన్
భక్త్యాధీనుడవు మురారీ!
ముక్తిన్ నా కొసగుము కృష్ణా!//
64.
ధృతహాలా -మ, భ, మ.
జీవాత్మా!మాధవ!రావేలా?
కావంగా వేగమె శ్రీనాధా!
నీవే మానాయకు డంచున్ సం
భావింతున్ నా మదిలో కృష్ణా!//
65.
త్రిలోకగామీ -మ, ర, య.
శ్రీరంగా!శ్రీధరా!మురారీ!
ప్రారబ్ధంబుల్ దొలంగ భక్తిన్
జేరంగా నీ దరిన్ ప్రభూ!నీ
కారుణ్యంబున్ దలంతు కృష్ణా!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి