మానవుడు ఆశాజీవి ఏనాటి కన్నా తన జీవితం రేపటికి మరింత సుఖవంతంగా జరగాలి అనుకుంటాడు అయితే ఈ ఆశ అనేది అంతటితో ఆగదు చాలామంది అత్యాశకు పోతాను చిన్న పని చేసిన ఏదో ఎక్కువ చేసినట్లుగా ఎక్కువ పరిష్కారం కావాలని కోరుకోవడం దీనితో పాటు దురాశ ఉంటుంది దీనివల్ల ఇతరుల ఆదాయాన్ని చూసి అసూయ చెంది నాకు అలాంటిది రావడం లేదు అని బాధ పడడం దానివల్ల ఆరోగ్యం చెడిపోవడం తప్ప జరిగే ఫలితం మాత్రం శూన్యం కనుక నీ కష్టార్జితానికి తగిన ఫలితం ఉన్నదా లేదా అని ఆలోచించు చాలు అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది ఆరాటం లేనిచోట ప్రశాంతత ఉంటుంది అని.ఇవాళ సమాజం ఎలా ఉన్నది అంటే తన పని తాను నెరవేర్చుకుంటూ ప్రక్క వారిని గురించి ఏమాత్రం ఆలోచించకుండా తన జీవితాన్ని గడపడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఏదైనా ఒక చిన్న కంప ముళ్ళకంప తనకు అడ్డు వస్తే దానిని రోడ్డు మీద వేస్తాడు ఆ వెనక వచ్చే చెప్పులు లేకుండా నడుస్తున్న వ్యక్తి అది గుచ్చుకుంటే ఎంత బాధ పడతాడో ఆలోచించండి ఆ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత అతను నడవలేడు ఇబ్బంది పడతాడు ఆ ముళ్ల ను తీసివేసిన తర్వాత సాఫీగా నడవగలడు అలాగే జీవితంలో కూడా మనసులో అహంకారం తొలగిపోతే జీవితంలో ఆనందం అనుభవం అవుతుంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అన్న ఆరాటంతో ఉన్నవాడికి ఈ ప్రపంచంలో ప్రశాంతత దొరకదు అన్న సత్యం తెలిస్తే ఆరాటం మానుకోవచ్చు.ఏ మతాన్ని ఏ ప్రవక్త ప్రారంభించిన సమాజ హితాన్ని కోరి మాత్రమే కొన్ని నియమాలను పెట్టుకుంటారు ఏ మతమైనా హత్యలు చేసే జీవించు వ్యభిచారం చేయి అని చెప్పదు కదా ఈ సమాజానికి మంచి జరిగేది ఏది ఉంటే దానిని ఎన్నుకొని దానిని విజయవంతం చెయ్ అని చెప్తారు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్లి విషయం తెలుసుకొని వారిని ఓదారుస్తూ వారికి ఏ రకమైన సహాయం కావాలో దానిని తాను చేయాలి పూర్తిగా సహాయం లేకపోతే మిగిలిన వారి సహకారాన్ని తీసుకొని అతని బాధను తొలగించాలి అది సామాజిక బాధ్యత అవుతుంది అలా చేసినట్లయితే అతని బాధలు పోయి హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఆ అభాగ్యునికి జీవిత మార్గాన్ని చూయించిన మార్గదర్శకులుగా మీరు ఉంటారు ఆయన చేసామన్న తృప్తి మీకు ఉంటుంది మీ సహాయంతో హాయిగా జీవిస్తున్న కృతజ్ఞత అతనికి ఉంటుంది.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి