బొమ్రాస్పేట్ :తెలంగాణ విద్యావంతులు వేదిక ఆధ్వర్యంలో యూత్ ఫర్ సేవా స్టేట్-స్వీట్ అనే స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నాందాపూర్ పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు బ్యాగులు పెన్నులు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో బీద పిల్లలు విద్యాభ్యాసన చేస్తారు కావున మీలాంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయ సహకారాలు ఎప్పటికీ విద్యార్థులు మరువలేరు అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించే సహాయకారాలు వారి విద్యాభ్యాసానికి సహాయపడుతుంది. స్టేట్ స్టేట్ యూత్ ఫర్ సేవా వారు మాట్లాడుతూ తొందర్లోనే కొడంగల్ నియోజకవర్గంలోని పాఠశాలల పేద విద్యార్థులకు డిజిటల్ క్లాసు రూమ్ సైన్స్ ల్యాబ్, ప్యూరి ఫ్లైయింగ్ వాటర్ ప్లాంట్, స్పోర్ట్స్ కిట్ విద్యార్థుల అభ్యర్థన మేరకు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామ్రెడ్డి విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ జిల్లా కోశాధికారి గౌరారం గోపాల్ దుద్యాల గెస్ట్ హెడ్ మాస్టర్ రామారావు మల్లయ్య రాహుల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి