జీవితం చాలా చిత్ర విచిత్రాలతో కూడినది జీవితం అన్న శబ్దం ద్వైతమా అద్వైతమా నిర్ణయించే శక్తి మన మేధ కు అందదు జీవితం అనేది ఒక శబ్దమా రెండు శబ్దాలా జీవి తనువుతో పని చేసే ప్రయాణాన్ని జీవితం అని అనవచ్చు కదా మరి ఈ జీవి లోపల ఉంటుంది శరీరం పైన కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు ఒకటిగా ఉన్నది కనుక ఇది ద్వైతము అంటాము రెండు ఉన్నాయి కనక అద్వైతము అంటాము ఈ తనువు ఏమైనా ఈ శరీరానికి ఏవైనా లక్షణాలు ఉన్నాయా లోపల జీవి ఏది చెపితే అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇలా చేయాలి అన్న ఆలోచన రాదు జీవి కనుక లేకపోయినట్లయితే ఈ తనువు ఒక ఆట బొమ్మలా తయారవుతుంది తప్ప ప్రత్యేకంగా తనను తాను సంతరించుకునే స్థితి లేదు అన్నది స్పష్టం.ఎవరికి వారు తాను ఏ పని చేస్తున్నారో అది నూటికి నూరుపాళ్ళు మంచిది అన్న అభిప్రాయంతోనే దానిని ప్రారంభిస్తారు అదే పని ఇంకొకరు చేయడం ప్రారంభించినప్పుడు ఆ పనిలో ఉన్న కష్టం ఏమిటో అది చేసేటప్పుడు ఎదుర్కోవలసిన సమస్యలు ఏమిటో అతనికి చెప్పడానికి ముందు ఉంటాడు కానీ తాను చేసే ఆ పని మాత్రం తప్పకుండా విజయాన్ని పొందుతుంది ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అన్న ధీమాతోనే బయలుదేరతాడు అలాకాకుండా ఇతరులకు ఏ సలహాలు అయితే ఇచ్చావో ఆ సలహాలను నీవు ఆలోచించి దాని వెనుక ఉన్న కష్టనష్టాలను కూడా తెలుసుకొన్న వాడివి కనుక వాటిని పరిహరించుకుంటూ ముందుకు వెళితే నిన్ను నీవు సరి చేసుకున్న వాడు అవుతావు ఈ ప్రపంచంలో తప్పు చేయని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు అయితే ఆ చేసిన తప్పును తిరిగి చేయకూడదు అలా చేసినట్లయితే క్షమించడానికి కూడా అతగాడు అర్హుడు కాదు అన్న విషయం స్పష్టం.
ఏ వ్యక్తికైనా తనలోనే మనసు కొన్ని ఆలోచనలను చేయిస్తూ ఉంటుంది వాటిలో కొంచెం మంచి ఉండవచ్చు మరికొన్ని చెడు ఉండవచ్చు ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందో సహజంగా ప్రతి వాడి హృదయం విశాలం అని చెబుతారు ఆ ప్రశాంతత వచ్చినప్పుడు మరింత విశాలంగా తయారవుతుంది ఇంటి నిండా అక్కడ ఇక్కడ వస్తువులన్నీ చిందర వందర చేసి ఉంటే చూడడానికి ఎంత చీకాకు గా ఉంటుంది ఎవరైనా బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు వీటిని గురించి ఎలా ఆలోచిస్తారో ఏమని అనుకుంటారో ఆ విషయాలను ఎప్పుడైనా గమనించారా ఏ వస్తువు ఎక్కడ ఉండాలో దానిని అక్కడ ఉంచితే చూడడానికి అందంగానే ఉంటుంది అలా కాకుంటేనే ఇలాంటి చీకాకు లు ఏర్పడతాయి.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి