రండి రండి ఓ పిల్లల్లారా
బండి కట్టుకుని రారాండీ
కొండ మీదికి ఎక్కుదాం
ఆ కొండపైన వున్నాడు
మన కోనేటి రాయుడు !!
కండ్లార చూద్దాము
ప్రేమతోడ పిలుద్దాం
మనసార కొలుద్దాం
చెంత కేమో చేరుదాం
చేతులెత్తి మొక్కుదాం !!
జ్యోతి కాంతిలో దేవుడు
ముసి ముసిగా నవ్వుతూ
పసిడి వర్ణములో నా
పరవశించి వస్తాడు
పరందాముని చూద్దాం !!
దయలెన్నో పంచుతూ
పండ్లు ఫలాలు ఇస్తాడు
పదిలంగా మనము వెళ్లి
ఫలాలను అందుకుని
దైవ దీవెనలు పొందుదాం !!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి