పిల్లలను స్వత్రంత్రం గా ఎదగనియ్యండి;-;-సి.హెచ్.ప్రతాప్

ఒకప్పుడు క్రీడలు, వ్యాయామం పిల్లల విద్యాభ్యాసం లో, నిత్య జీవితాలలో భాగం గా వుండేది. స్కూళ్లలో ప్రతీ రోజు ఒక పీరియడ్ పి టి లేక ఆటల కోసం కేటాయించేవారు.అట్లే వారం లో ఒక పీరియడ్ అభిరుచుల కోసం తప్పనిసరిగా వుండేది. ఈ పీరియడ్ లో విద్యార్ధులు తమకు నచ్చిన రంగం అంటే సంగీతం, పాటలు, చిత్రలేఖనం, పేయింటింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్చుకునేవారు. విద్యాభ్యాసం అనేది శారీరక, మానసిక వికాసం తో పాటు జీవితం లో ఉపయోగపడేదిగా వుందాలనేది నాటి విద్యా వ్యవస్థ యొక్క అభిమతం గా వుందేది. అయితే కాలక్రమేణా విధ్యార్ధులను కేవలం ర్యాంకులు, పెర్సెంటేజిలు సాధించే మరబొమ్మలుగా చూసే విద్యా విధానం రూపుదిద్దుకోవడం వలన వారిలో సృజనాత్మకత నసించడం ప్రాఅంభమయ్యింది. విద్యాభ్యాసం లో ఆటపాటలకు స్థానమే లేకుండాపోయింది. ఎంత విజ్ఞాఞానం  సంపాదించారన్నది అప్రధానమైపోయి, ఎన్ని మార్కులు సాధించారనే అంశమే ప్రధానం అయ్యింది.సహజమైన తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరమే లేని విద్యా విధానం రూపుదిద్దుకోవడం వలన విధ్యార్ధులకు మంచి మార్కులురావచ్చేమోగాని నిజజీవితం లో సమస్యలు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనే ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం , సానుకూల ధోరణి తో వుండే ఆలోచనా విధానం మాత్రం కొరవడుతున్నాయని నిస్సందేహం గా చెప్పవచ్చు. అందుకే తల్లిదండ్రులుగా మన పిల్లలలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం రూపుదిద్దుకునేందుకు క్ర్షి చేయాల్సిన అవసరం ఎంతో వుంది.  కాస్త చిన్నపాటి ఒడిదుడుకులను కూడా తట్టుకోలేని మానసిక బలహీనతలు నేటి యువతరాన్ని ఆవహిస్తున్నాయంటే అందుకు ముఖ్య కారణం విధ్యార్ధులలో జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం, సాహస ప్రవృత్తి, మానసిక దృఢత్వం లోపించడమే.వీటిని ఆపాదించాల్సిన విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయి మార్కులు, ఉద్యోగాలు, ధనార్జనే ధ్యేయమన్న అపసవ్య ఆలోచనా పెంపొందిస్తోంది.తల్లిదండ్రులు కూడా తాము జీవితం లో సాధించలేకపోయినవటిని తమ పిల్లలు ఎలాగైనా సాధించాలనే స్వార్ధబుద్ధితో వారి ఇష్టా ఇష్టాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా తమకు నచ్చిన వాటిని వారిపై బలవంతంగా రుద్దేస్తున్నారు.పిల్లలను వారి ఆలోచనా విధానానికి, అకాంక్షలకు అనుగుణంగా ఎదగనివ్వడం లేదు. అధికశాతం పిల్లలు పెరిగి యుక్తవయస్సుకు వచ్చాక వ్యతిరేక ఆలోచనావిధానాన్ని ఆపాదించుకోవడానికి వెనుక ముఖ్య కారణం ఇదే. పిల్లలకు తమకు నచ్చిన రంగాన్ని తామే ఎంచుకొని అందులో పురోగతి సాధించే స్వాతంత్రం ఇవ్వడం చాలా అవసరమని ప్రపంచ వ్యాప్తం గా 185 దేశాలలో రెండున్నర లక్షల మంది యువతీ యువకులపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ సోషల్ డెవెలప్ మెంట్ చేసిన ఒక అధ్యయనంలో తేలింది. అట్లే బాల్యంలో, ఎదుగుతున్న వయస్సులో ఎప్పుడూ పుస్తకాలు, కంప్యూటర్లు,స్మార్ట్ ఫోన్లు, ఇండోర్ ఆటలు, అంతర్జాలం, సామాజిక మాధ్యమాల ద్వారా చాటింగ్ క్లాస్ రూములే కాకుండా వారికి  రోజుకూ కనీసం రెండు గంటల పాటు బయట ఆటలు ఆడుకునేందుకు, స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడిపే విధంగా దినచర్య రూపొందించబడాలని సదరు నివేదిక సూచిస్తోంది. చదువే లక్ష్యంగా సాగే విద్యావిధానం వలన విధ్యార్ధులు మంచి ఈంజనీర్లు, డాక్తర్లు లేదా లాయర్లు అవవచ్చునేమోగాని మంచి వ్యక్తులు కాలేరని, చిన్నతనంలోనే జీవితం లో కృతిమత్వం కారణం గా వారిలోని సృజనాత్మకత పూర్తిగా నశించిపోతొంది. చిన్నతనం లో వారికి ఎలాంటి మధురానుభూతులు మిగలకపోవడం వలన అధిక శాతం యువత నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. మీ చర్యలు మీ చర్యల ద్వారా ఇతరులతో ఎలా వ్యవహరిస్తాయో తెలుసుకోవడం నిరంతరం తెలుసుకుంటుంది, కాబట్టి మీరు కిరాణా దుకాణం వద్ద క్యాషియర్తో మాట్లాడటం లేదా మీ భార్యతో అసమ్మతితో ఎలా వ్యవహరిస్తారో గుర్తుంచుకోండి. జీవితం లో వారు ఏం సాధించాలనుకుంటున్నారన్న ప్రశ్నను వారిని తరచుగా అడుగుతూ, ఆ రంగం ఎందుకు ఎంచుకున్నారన్న అంశాన్ని వారి చేతే విశ్లేషణ చేయిస్తే వారి ఆలోచనలలో ఎంతో స్పష్టత వస్తుంది.
ఈ పనే చెయ్యాలి, ఈ పని చెయ్యవద్దు, ఈ చదువే చదవాలి, రోజుకు ఈ పని ఈ టైముకే చెయ్యాలి అన్న ఆంక్షలు , మితిమీరిన క్రమశిక్షణ, వారిలోని సృజనాత్మకతను , విభినంగా ఆలోచించే మనస్థత్వాన్ని, క్రియేటివిటీని,పార్శ్వంగా ఆలోచించగలగడాన్ని నాశనం చెసి వారిని సమయానికి ఒకేలా స్పందించే ప్రవర్తనను అలవాటు చేస్తుంది. ఇది పిల్లలలో అంతర్గత ప్రతిభను వెలికితీయనివ్వదు. అందుకే పిల్లలను నిరంతరం ఒక కంట కనిపెడుతునే వారు చెడు మార్గం పట్టకుండా నియంత్రిస్తునే , వారి పరిధిలో వారిని స్వతంత్రంగా ఎదగనియ్యడం ఉత్తమమైన విధానం అని సదరు నివేదిక కుండబద్దలు కొట్టింది. హానికరం కానంతవరకు వారు తమ మనస్సుకు నచ్చిన పనులను చేసే స్వాతంత్రం ఇవ్వడం తల్లిదండ్రులుగా మన ధర్మం. 
కామెంట్‌లు