అకస్మాత్తుగా ఆకాశం
జలఖడ్గం దూసింది
ప్రకృతి మొత్తం జలగుండం అయ్యింది
చెట్టూపుట్టా, గొడ్డూగోదా, కొంపాగోడూ
పాడీపంటలను జలబాహువులతో
తనలోకి లాగేసింది
పిండీబియ్యం, ఉప్పుపప్పూ
అన్నింటినీ
జలజిహ్వ చప్పరించేసింది
పిల్లాజెల్లా మూసలీమూతకలు
కడుపునిండా నీళ్ళుతాగి
మరి లేవలేదు
ప్రకృతి మొత్తం
జలకడలిని తలపించింది
జనజీవన స్రవంతిని
ఛిన్నాభిన్నం చేసింది
కంటిలోని నీరుకూడా
ఆ నీటిలో కొట్టుకుపోయిన
బాధాతప్త హృదయాలకు
మనసు పెంచి మమతపంచాలి
అక్కున చేర్చి ఆదరించాలి
మనమంతా ఒక్కటై
చేయూత నివ్వాలి
అదే మానవతకు ప్రతీక
మనుజ జన్మకు సార్థకత!!
**************************************
జలఖడ్గం దూసింది
ప్రకృతి మొత్తం జలగుండం అయ్యింది
చెట్టూపుట్టా, గొడ్డూగోదా, కొంపాగోడూ
పాడీపంటలను జలబాహువులతో
తనలోకి లాగేసింది
పిండీబియ్యం, ఉప్పుపప్పూ
అన్నింటినీ
జలజిహ్వ చప్పరించేసింది
పిల్లాజెల్లా మూసలీమూతకలు
కడుపునిండా నీళ్ళుతాగి
మరి లేవలేదు
ప్రకృతి మొత్తం
జలకడలిని తలపించింది
జనజీవన స్రవంతిని
ఛిన్నాభిన్నం చేసింది
కంటిలోని నీరుకూడా
ఆ నీటిలో కొట్టుకుపోయిన
బాధాతప్త హృదయాలకు
మనసు పెంచి మమతపంచాలి
అక్కున చేర్చి ఆదరించాలి
మనమంతా ఒక్కటై
చేయూత నివ్వాలి
అదే మానవతకు ప్రతీక
మనుజ జన్మకు సార్థకత!!
**************************************

అభినందనలు సార్ 🌹🙏🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి