శివానంద లహరి ;- కొప్పరపు తాయారు
4)
శ్లో!! సహస్రం వర్తంతే జగతి విబుదాః క్షుద్రఫలధాః
న మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృతఫలమ్!
హరి బ్రహ్మాదీ నామపి నికటబాజా మ సులభం
చిరం యా చే శంభో శివ తవపదాంభోజ భజనమ్ !!

భావం: శివా! జగత్తులో కొద్దికొద్ది ఫలములు ఇచ్చు దేవతలు ఎందరో ఉన్నారు. వారిని అనుసరించడం గానీ, వారిచ్చే ఫలములు గానీ నేను ఆశించను. ఎల్లప్పుడూ నీ సన్నిధానం లో ఉండే బ్రహ్మ, విష్ణువు, వంటివారికి కూడా దొరకని మీ పాద సేవనే నేను చిరకాలము వేడుకొనుచున్నాను.
                    *****
.

కామెంట్‌లు