ఎనిమిదో తేదీన జరగవలసిన పాఠశాల యాజమాన్య కమిటీ ఎంపిక, ప్రభుత్వ నిర్దేశాల మేరకు నేడు ఎన్నుకోవడం జరిగిందని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు.
ఛైర్మన్ గా బూరాడ రమేష్, వైస్ చైర్ పర్సన్ గా కిల్లారి జయసుధ ఎంపికైనట్లు ఆయన తెలిపారు.
సి.ఆర్.ఎం.టీ. అగతముడి గోవిందరావు ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
అనంతరం ఎన్నికైన ఛైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులందరిచే ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు ప్రమాణ స్వీకారం గావించారు. ఎన్నికల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు పర్యవేక్షణ గావించారు. పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈనాటి ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించారు.
ఈ ఎన్నికల నిర్వహణలో ప్రధానోపాధ్యాయులకు సీనియర్ సహోపాధ్యాయులు తూతిక సురేష్, కుదమ తిరుమలరావు సహకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. పాఠశాల అభ్యుదయానికి తమవంతు పూర్తి సహకారాలనందిస్తామని ఛైర్మన్ బూరాడ రమేష్, వైస్ చైర్ పర్సన్ కిల్లారి జయసుధ అన్నారు. పాఠశాలలో మరికొన్ని మొక్కలు నాటే చర్యలు సత్వరమే గైకొనుటకు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి