" కోరాడ నానీలు " * స్వేచ్చ *

 పర పీడనలో దేశం
 శతాబ్ధాల వేదన...! 
  సత్యాగ్రహంతో
    దాస్య విముక్తి...!!
       ****
  ఎందరో దేశ భక్తుల
   త్యాగాలఫలితమే
    దేశానికి స్వేచ్ఛా
      స్వాతంత్ర్యాలు
     *****
మహిళా స్వేచ్ఛ
   మాటల్లోనేనా...! 
అడుగడు గునా... 
 హత్యలు ,మానభంగాలేనా
      *******
పంజరంలోరామచిలుక
 వెట్టి చాకిరి బాలుడు
   స్వేచ్ఛ కోసం
     తహ తహ...! 
     *****
మాదకత మత్తులో
  యువత నిర్వీర్యం
   పెద్దల ముద్దు 
   స్వేచ్ఛ దురుపయోగం ! 
       *****
కామెంట్‌లు