బిచ్చగాడికో మార్గం;-- యామిజాల జగదీశ్
 రైల్లో నుంచి ఏదో పరధ్యాన్నంలో ఉన్న ఆ బిచ్చగాడిని మరొక బిచ్చగాడు "ఏంటీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది?" అని అడిగాడు.
"ఈరోజు రైల్లో అందరినీ అడుగుతున్నట్లే ఓ కోటు సూటులో ఉన్న ఓ వ్యాపారిని బిచ్చమడిగాను. బిచ్చం వేయడం ఇష్టం లేని వాళ్ళు చేతులూ కాళ్ళూ బాగానే ఉన్నాయిగా....ఏదైనా పని చేసుకోవచ్చుగా. " అంటూ పరధ్యాన్నంలో ఉన్నతను మాటలు కొనసాగించాడు. "ఆ వ్యాపారి మీలాంటి వాళ్ళు ఎదుటివారికి ఏమీ ఇవ్వకుండా ఎప్పుడూ అయ్యా అమ్మా అంటూ ఎలా అడగ్గలుగుతున్నారు. నేను వ్యాపారిని. ఏదో ఒకటి ఇచ్చి అడగండి" అన్నాడు. ఆలోచిస్తే ఆయన చెప్పింది నిజమే కదా అనిపించింది అని అన్నాడు.
అక్కడితో ఆగని ఆ బిచ్చగాడు "ఏదీ ఇవ్వకుండా ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని ఏదో ఒకటి అడిగే పద్ధతి మార్చుకోవాలి. ఏదైనా ఇస్తేనే ఇతరుల నుంచి డబ్బులడుగుతానన్నాడు. ఇలా ఓ నిర్ణయానికి రావడం బాగానే ఉంది. కానీ తినేమివ్వగలను అని ఆలోచించాడు బిచ్చగాడు.
 
ఆరోజంతా ఆలోచించిన ఆ మనిషి మరుసటి రోజు రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న ఓ చెట్టులో పూచిన పువ్వులను కోసి రైలెక్కాడు. తనకు దానం చేసిన వారందరికీ రెండు చేతులూ జోడించి ఒక్కో పువ్వు ఇచ్చాడు. తన వద్ద పువ్వులున్నంత వరకూ ఇచ్చి ఆ తర్వాత రైలు దిగిపోయేవాడు.
ఇలా రోజూ చేస్తూ వచ్చాడు. బిచ్చగాళ్ళల్లో ఇతను ఒకింత భిన్నంగా కనిపించడంతో రోజూ ఇస్తున్న దానికన్నా ఎక్కువగా అతనికి ఇస్తూ వచ్చారు. బిచ్చగాడికీ మనసులో ఆనందం. తానూ ఏదో ఒకటి ఇస్తున్నందుకు. 
ఇలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఒకరోజు ఆ వ్యాపారి మళ్ళీ రైల్లో ఎదురుపడ్డాడు.ఆయనను చూడటంతోనే బిచ్చగాడికి ఆనందం. తిన్నగా ఆయన వద్దకు వెళ్ళి "ఈరోజు నా దగ్గర కొన్ని పువ్వులున్నాయి. ఈరోజు మీరు నాకేమిస్తారు" అని అడిగాడు బిచ్చగాడు. 
వ్యాపారి ఆ పువ్వుల్ని తీసుకుని డబ్బులిస్తూ "ఇప్పుడు నువ్వు కూడా నాలాగా ఓ వ్యాపారివయ్యావు" అని నవ్వాడు. 
బిచ్చగాడి మనసుని స్పృశించాయి ఆ వ్యాపారి మాటలు.  
మరుసటి స్టేషన్లో బిచ్చగాడు మహదానందంతో దిగాడు. 
"నేనిక బిచ్చగాడిని కాను. ఒక వ్యాపారిని.
వ్యాపారం చేస్తాను. ఆ వ్యాపారిలా నేనూ మారుతాను. డబ్బకి లోటు లేకుండా జాగర్తపడతాను..." అని లోలోపల అనుకున్నాడు. 
అతని పక్కనున్న మరొక బిచ్చగాడు "ఇతనికేదో పిచ్చి పట్టిందనిశ స్తోంది..." అని అనుకున్నాడు. 
కానీ మరుసటి రోజు నుంచి ఆ బిచ్చగాడు ఆ రైల్వే స్టేషన్లో మళ్ళీ కనిపించనే లేదు.
- తమిళంలో చదివిన కథ ఇది. ఎవరు రాసారో తెలీలేదు కానీ బాగుందనుకుని ఆనుసృజించాను.

కామెంట్‌లు