అమ్మ మాట వినాలి ; :ముంజులూరి కృష్ణ కుమారి

 నీలగిరి అడవిలో 'జంబూ ' అనే నక్క పిల్ల ఉంది. వాళ్ళమ్మ జంబూ కి ఎక్కడకు వెళ్లకు. అల్లరి చేయద్దు అని చెప్పినా సరే అది అటు ఇటూ వెళ్లి ఏదో ఒక దెబ్బ తగిలించుకునేది.
ఒకరోజు జంబూ నది ఒడ్డున గుడ్లను పొదుగుతున్న ఒక బాతు నువ్వు చూసి దాని వెనక్కి వెళ్లి బాతు  తోక పట్టుకో బోయింది. వెంటనే బాతు 'క్వా ''క్వా' అంటూ జంబూ మీద పడి జంబూ కళ్ళలో పొడవబోయింది. జంబూ  ఆ దెబ్బకు భయపడి ఎప్పుడూ బాతుల జోలికి వెళ్ళకూడదు అనుకుంది.
       మర్నాడు జంబూ ఒక పొలం పక్కన వెళుతూ ఆ పొలం లో మొక్కజొన్న కంకులు చూసి నోరు ఊరి పొలం లోకి వెళ్లి కంకులు తెంపబోయింది. ఇంతలో ఒక మూల నుంచి కాపలా  కుక్కలు భౌ భౌ అంటూ వెంట పడ్డాయి. బతుకు జీవుడా అనుకుంటూ జంబూ అడవిలోకి పరుగు తీసింది.
           ఈసారి పొలం వేపు వెళ్ళకూడదు అనుకుని అడవిలో మర్రిచె ట్టు  కింద ఎండుటాకులు కుప్ప కనపడింది. దాన్ని ముట్టె తో అటు ఇటూ చెల్లా చెదురు చేయబోయింది. కసుక్కున సూదుల్లాంటి 
ముళ్ళు గుచ్చుకున్నాయి. అబ్బా! చచ్చాన్రా బాబు అనుకుంటూ కళ్ళు చికిలించి చూసింది. ఆకుల కుప్ప లోంచి ముళ్లపంది తల బయట పెట్టి ఎక్కడ బడితే అక్కడ తల దూర్చ వద్దని మీ అమ్మ చెప్పలేదా అని గుర్రుమంది. 
        నొప్పితో ఏడుస్తూ ఇంకెప్పుడూ ఎలాగంటే అలా తిరగను. బుద్ధి వచ్చింది అని అమ్మ దగ్గరకు వెళ్ళింది జంబూ.

కామెంట్‌లు