జనారణ్యంలో....;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కాలనాగులున్నాయి
బుసకొడుతున్నాయి
భయపెడుతున్నాయి
కాటేస్తున్నాయి
కర్రలుపట్టాల్సిందే
కొట్టవలసిందే
పట్టేయాల్సిందే
కోరలుతీయాల్సిందే

క్రూరమృగాలున్నాయి
గర్జిస్తున్నాయి
వెంటబడుతున్నాయి
ప్రాణాలుతీస్తున్నాయి
తుపాకులుధరించాల్సిందే
కాల్చాల్సిందే
బంధించాల్సిందే
కాపాడుకోవాల్సిందే

అచ్చేసినాంబోతులున్నాయి
కయ్యానికికాలుదువ్వుతున్నాయి
పెద్దపెద్దగారంకెలేస్తున్నాయి
పదేపదేవెంటబడుతున్నాయి
ముక్కుతాడేయాల్సిందే
కట్టిపడవేయాల్సిందే
దారికితేవాల్సిందే
గర్వమణాచాల్సిందే

రాక్షసులున్నారు
రమణులనుచేబడుతున్నారు
అత్యాచారాలుచేస్తున్నారు
హింసకుదిగుతున్నారు
ఎదిరించాల్సిందే
పీచమణచాల్సిందే
మదులుమార్చాల్సిందే
మనుషులనుచేయాల్సిందే

కాకులున్నాయి
గుమిగూడుతున్నాయి
గోలచేస్తున్నాయి
చీకాకుపెడుతున్నాయి
కేకలెయ్యాల్సిందే
రాళ్ళువిసరాల్సిందే
తోలవలసిందే
ప్రశాంతతపొందాల్సిందే


కామెంట్‌లు