అపరిమితమైన కోర్కెలను అదుపుచేసి, సామాజిక బాధ్యతతో జీవిస్తే ఆ జీవనం ప్రశాంతంగా సాగుతుందని మన శాస్త్రాలు ఏనాడో బోధించాయి.జీవితం ప్రశాంతంగా సాగాలని ప్రతివారూ కోరుకుంటారు. ఆ ప్రశాంతతకు ఆనందం కూడా తోడైతే ఆ జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి అపురూపమైన జీవితంకోసం కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి, పాత అలవాట్లు వదిలించుకోవాలి. అలాచేయకపోవటం వల్లనే ఈ తరం జీవితంలో అశాంతి, ఆదుర్దా పెరుగుతోంది.జీవిత సమస్యలకు పరిష్కారాలు చాలాసార్లు, చాలా సులువుగా వుంటాయి. చాలా లోతుగా ఆలోచించినా కనిపించని పరిష్కార మార్గాలు, సులభమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఎదుటివాళ్ళు మనతో ఎలా ప్రవర్తించాలని, మనం ఆశిస్తామో, అదే ప్రవర్తనను మనం ఎదుటివారి పట్ల చూపించడం. ఇతరులు మన పట్ల స్వీయ క్రమశిక్షణ కలిగి, సమయపాలనా విలువలు పాటిస్తూ వుండాలంటే, మనం కూడా వారిపట్ల అదే బాధ్యతను కలిగి వుండాలి. ప్రార్థన అనేది కేవలం ఆధ్యాత్మికమైనదే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రార్థనను కేవలం మతపరమైన బాధ్యతగా చూడక మన ఆత్మను ప్రశాంతంగా ఉంచే ఒక అభ్యాసంగా భావించాలి. రోజువారీ అలవాట్లలో భాగంగా ప్రార్థనను కూడా మార్చుకుంటే అంతర్గతంగా శాంతి లభిస్తుంది. జీవితంలో ఉన్న గందరగోళాల మధ్య అంతర్గత శాంతి దక్కాలంటే ప్రార్థన చాలా ముఖ్యం. ప్రార్థన మనలో ప్రశాంతతను, ధైర్యాన్ని నింపుతుంది. ధ్యానం సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది మరియు ఇంతకు ముందు సాధ్యపడని విధంగా సమస్యను పరిష్కరించడంలో కూడా సహాయపడుతుంది. ప్రశాంతమైన మనస్సుకు చేరుకోవడం యొక్క నిజమైన అర్థంలో, ధ్యానం నేర్చుకోవడం , సాధన చేయడం సులభం. బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ప్రవర్తన విశ్లేషణ, కౌన్సెలింగ్ వంటి వాటి ద్వారా మానసిక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టి ప్రశాంతమైన జీవనం కొనసాగించవచ్చు.ఒకరోజు ఉదయం రోజు వారి కార్యాకలాపాలు ప్రారంభించేముందు కాసేపు సూర్యకాంతిలో కూర్చోవడం చాలా ముఖ్యం. కాసేపు మార్నింగ్ వాక్ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఆరు బయట కూర్చుని కాఫీ తాగడం వంటివి చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది. సూర్యరశ్మి, ప్రకృతి మనకు మంచి స్నేహితులు. మనలో మానసిక శక్తిని పెంచుతాయి.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఎన్నడో తెలిపాడు. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అన్న మాటకు చోటే ఉండదు. ఇక అంగీకరించడం, వదిలిపెట్టడం అనే దానిని అలవాటుగా మార్చుకోవాలని బుద్ధుడు మానవాళికి విలుఇవైన సందేశం ఇచ్చాడు. బుద్ధుడి బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయతో ఉండడం. దయా, కరుణా ఉన్నవారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు.
అహంకారం మనిషిని నాశనం చేస్తుందని బుద్ధుడు తెలిపాడు. అహాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్లు చెబుతారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి