పసిడి కాంతి వెలుగులో
పరవశించు పూలలో
పరిభ్రమించే రంగురంగుల
సీతాకోక చిలుకలంటి ఆశలు.
చిన్ని చిన్ని సరదాలు
చిగురించు తరుణాన
చిత్తమున కొత్తగా
పొటమరించు కోరికలు.
కనుల రెప్పల దాగినట్టి
కళ్ళు తెరచి కన్న కలలు
క్షణ క్షణమూ పెరుగుతూ
వెలుగువోలె పరచుకొనగా...
అధరాల తనకు తానే
విచ్చుకున్న నవ్వు పువ్వు
అంతరంగపు పూలవనంలో
అందముగా పరిమళించెగా!
తెలి వెలుగుల తోరణాలు
మెల మెల్లగ ఊగుతుంటే
చల చల్లగ పూలగాలులు
పలకరించిపోతుంటే...
ప్రతి క్షణమూ అనుభవింపగ
ప్రతి కణమూ పరిమళింప
ప్రతి మనసూ సిధ్ధమవగా
ప్రతి వేకువా పరిమళించదా!
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి