1
డాక్టర్ బెన్ కార్సన్ చెప్పారు,
"నేను ప్రాథమిక దశలో పాఠశాలలో చదువుసంధ్యలలో అనేక రకాలుగా కష్టపడ్డాను, అయితే నేను 1987లో ప్రపంచంలోనే అత్యుత్తమ న్యూరో సర్జన్ అయ్యాను"
.
పాఠం:
కష్టపడటం అనేది విజయానికి చేరువలో ఉన్నామని సంకేతం. కనుక కష్టాలకు భయపడి లక్ష్య సాధన నుంచి పక్కకు తప్పుకోకూడదు.
.
2
ఓప్రా విన్‌ఫ్రే చెప్పిన మాట...
నన్ను తొమ్మిదో ఏట మానభంగం చేశారు. అయినప్పటికీ నేను ప్రపంచంలోని అత్యంత ప్రభావిత మహిళల్లో ఒకర్నిగా నిలిచాను.
.
పాఠం:
మన గతం మన భవిష్యత్తును నిర్ణయించనివ్వక స్థిర నిశ్చయంతో పురోగమించాలి.
.
3
బిల్ గేట్స్ ఇలా అన్నారు....
నేను నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేయలేదు, కానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడినయ్యాను.
.
పాఠం...
పాఠశాల మనల్ని ధనవంతులను చేయదు. పాఠశాల మన ఆలోచనా విధానానికి మెరుగులు దిద్దుతుంది. దానిని ఆచరణలో పెట్టి విజయం సాధించాలి.
.
4
జాయిస్ మేయర్ ఇలా అన్నారు...
నేను పద్దెనిమిదేళ్ల వయసులో ఇంంటిని విడిచిపెట్టి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టే వరకు మా నాన్న నన్ను లైంగికంగా, మానసికంగా, మానసికంగా మాటలతో దుర్భాషలాడారు. ఐనప్పటికీ ప్రపంచంలో అనేకమందిని ప్రభావితం చేసే బోధకులలో ఒకరుగా ఎదిగాను.
.
పాఠం:
గతం మనల్ని ముందుకు నడిపించేటట్లుండాలి. అంతేతప్ప మనల్ని వీరింతే అన్నట్లు చెప్పనివ్వకూడదు. పరిమితం చేయడం కాదు.
5
క్రిస్టియన్ రొనాల్డో ఇలా అన్నాడు...
మనం ధనవంతులమవుతామని నేను మా నాన్నతో చెప్పాను. కానీ ఆయన నా మాట నమ్మలేదు. కానీ నేను చెప్పిన మాటను నిజం చేసాను
.
పాఠం:
మాటలు మన జీవితాన్ని శాసిస్తాయి. మనం చెప్పిన దానికి కట్టుబడి ఆచరణలో పెట్టగలగాలి. అప్పుడు ప్రతి మాటా నెరవేరుతుంది. మనమేంటో ఎదుటివారికి అర్థమవుతుంది.
.
6
లియోనెల్ మెస్సీ చెప్పిన మాట...నాకిష్టమైన ఫుట్‌బాల్ క్రీడలో శిక్షణకు కావలసిన డబ్బుని గడించడానికి ఒక కొట్లో టీలు అందిస్తుండేవాడిని. తర్వాతి రోజుల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకడిగా మారాను.
.
పాఠం:
మన కలల మీద నమ్మకముంచాలి. పడిన బాధ భవిష్యత్తేంటో చెప్పనివ్వకూడదు.
.
7
స్టీవ్ జాబ్స్ ఇలా రాశాడు, "నేను నా స్నేహితుల గదుల్లో నేలపై పడుకునేవాడిని. ఆహారం, డబ్బు కోసం కోక్ బాటిళ్లను తిరిగిచ్చేవాడిని. స్థానికాలయంలో వారానికోసారి ఉచిత భోజనం పొందేవాడిని. అయితే నేను తర్వాతి రోజుల్లో అందరూ చెప్పుకునేలా "ఆపిల్ కంపెనీ"ని నెలకొల్పాను.
.
పాఠం:
ఈరోజు చిన్నవాడినైనంత మాత్రాన రేపుకూడా చిన్నవాడిగానే ఉండిపోతానని కాదు. దేవుణ్ణి విశ్వసిస్తూ ఉండాలి.
.
8
బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇలా అన్నారు...మా ఉపాధ్యాయులందరూ నన్ను ఒరేయ్ ఫెయిల్యూర్ అని పిలుస్తుండేవారు. కానీ నేను ప్రధానమంత్రి అయ్యాను.
.
పాఠం
మన గురించి వేరొకరి అభిప్రాయాలు మనల్నలాగే ఉండిపోనివ్వకూడదు. వాస్తవికతనెరిగి ముందుకు దూసుకుపోవాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి