ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది
===========================================
క్రొత్త వృత్తములు.
============
81.
నీల -భ, భ, మ, గ, గ.
యతి - 7.
దారుణ బాధల తాపంబుల్ కాల్చెన్
నీరసమొచ్చెను నీవే నన్ బ్రోవన్
రార!పరాత్పర!రాజీవాక్షా!నే
జేరితి నీదరి శీఘ్రంబే కృష్ణా!//
82.
రోచక - భ, భ, ర, గ, గ.
యతి - 7.
శక్తినొసంగెడి శార్ఘ్యపాణీ నిన్
భక్తిగ దల్చెద పాహి!గోవిందా!
ముక్తికి పాథిని పొంద నిన్నే సం
రక్తిగ మ్రొక్కెద రమ్ము!శ్రీకృష్ణా!//
83.
శ్రితమాలా - భ, భ, స, గ, గ .
యతి - 7.
కాపరి వీవని కనుగొంటిన్ సం
తాపము తీర్చుము!దనుజారీ!నా
పాపము లెంచకు భవహారీ!నే
నేపరి హారము లెరుగన్ కృష్ణా!//
84.
కందవినోదః - భ, మ, స, గ, గ.
యతి -7.
దండిగ భాగ్యంబుల్ దయతో నీయన్
గొండలపై నీవే కొలువై యుండన్
బండుగ చేయంగా బగితిన్ దల్తున్
గొండలరాయా!నీ గుణముల్ కృష్ణా!//
85.
నవశాలినీ - భ, ర, న, గ, గ.
యతి - 7.
గోపవిహారి!నీకు నమతుల్ నా
శాపము దొల్గగన్ సలిపి పూజల్
నీపద సన్నిధిన్ నిలిచి యుంటిన్
ఆపద తీర్పుమా!యనఘ!కృష్ణా!//
===========================================
క్రొత్త వృత్తములు.
============
81.
నీల -భ, భ, మ, గ, గ.
యతి - 7.
దారుణ బాధల తాపంబుల్ కాల్చెన్
నీరసమొచ్చెను నీవే నన్ బ్రోవన్
రార!పరాత్పర!రాజీవాక్షా!నే
జేరితి నీదరి శీఘ్రంబే కృష్ణా!//
82.
రోచక - భ, భ, ర, గ, గ.
యతి - 7.
శక్తినొసంగెడి శార్ఘ్యపాణీ నిన్
భక్తిగ దల్చెద పాహి!గోవిందా!
ముక్తికి పాథిని పొంద నిన్నే సం
రక్తిగ మ్రొక్కెద రమ్ము!శ్రీకృష్ణా!//
83.
శ్రితమాలా - భ, భ, స, గ, గ .
యతి - 7.
కాపరి వీవని కనుగొంటిన్ సం
తాపము తీర్చుము!దనుజారీ!నా
పాపము లెంచకు భవహారీ!నే
నేపరి హారము లెరుగన్ కృష్ణా!//
84.
కందవినోదః - భ, మ, స, గ, గ.
యతి -7.
దండిగ భాగ్యంబుల్ దయతో నీయన్
గొండలపై నీవే కొలువై యుండన్
బండుగ చేయంగా బగితిన్ దల్తున్
గొండలరాయా!నీ గుణముల్ కృష్ణా!//
85.
నవశాలినీ - భ, ర, న, గ, గ.
యతి - 7.
గోపవిహారి!నీకు నమతుల్ నా
శాపము దొల్గగన్ సలిపి పూజల్
నీపద సన్నిధిన్ నిలిచి యుంటిన్
ఆపద తీర్పుమా!యనఘ!కృష్ణా!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి