న్యాయాలు-606
ప్రభాత మేఘ న్యాయము
******
ప్రభాతం అనగా తెల్లవారు సమయము, వేకువ.మేఘం అనగా మబ్బు అని అర్థము.
వేకువలో చిరు గాలికి కదిలే మేఘం ఎలా వుంటుందో మరియు రమణీయం, కమనీయం అయిన వేకువ గురించి చెప్పడమే ఈ న్యాయము యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం.
ప్రభాత సమయమే సౌందర్యానికి ఆలవాలం.బాల భానుడి లేలేత కిరణాలు పుడమి తల్లిని ముద్దాడే వేళ ప్రకృతిలో కలిగే మార్పులు ఎంతో హృద్యంగా వుంటాయి. ఎరుపు, నారింజ మిగతా రంగుల కలనేతతో ప్రభాత మేఘాలు చూపరుల దృష్టిని మరల్చ తీయకుండా మనసును కట్టిపడే పడేలా చేస్తాయి.
ఆకాశమనే కాన్వాస్ పై కిరణాల కుంచెతో మేఘాలను చిత్రించిన సృష్టి కర్త ఈ భూమ్మీద నివసించే మనకు ఎంతో గొప్ప కానుకగా ఇచ్చినందుకు మనమంతా వినమ్రంగా తలవంచి నమస్కరించాల్సిందే.
తెల్లని పావురాల గుంపుగా సాగిపోయే మేఘాలు ఉషాదయ కాంతుల సరోవరంలో మునకలేసి సీతాకోక చిలుకల్లా ముస్తాబవడం చూడ ముచ్చటగా ఉంటుంది.
ఈ ప్రపంచాన్ని మేల్కొలిపే రవి కిరణాలు ప్రభాత మేఘాలతో జోడికట్టి చెట్టాపట్టాలేసుకుని హాయిగా తిరుగుతూ జనావళికి మేల్కొలుపు పాడుతూ వుంటాయి అది గమనించిన పక్షులు తమ రెక్కలు టపటప లాడిస్తూ, ఒళ్ళు విరుచుకుంటూ కిలకిలా రావాలతో ప్రభాత గీతాలు ఆలపిస్తాయి. అదంతా చూస్తున్న చిన్నారి పూల మొగ్గలు చిగురుటాకుల మాటునుండి తొంగి చూస్తూ చిరునవ్వుతో విచ్చుకోవడం మొదలు పెడతాయి.ఈ విధంగా ప్రభాత మేఘాలు నిత్యం నూతనత్వాన్ని సంతరించుకుని జీవితాన్ని ఎలా ఆహ్లాదంగా గడపాలో బోధిస్తుంటాయి.
ఇక భక్తులు మేఘాన్ని సాక్షాత్తూ భగవంతుని స్వరూపంగా కొలుస్తుంటారు.ఎందుకంటే మేఘం నీలి రంగులో భగవంతుని మేని ఛాయను తలపిస్తూ ఆకాశమంతా పరుచుకుని గంభీరంగా కనిపిస్తుంది.అలాగే సముద్రుడి నుండి నీటిని గ్రహించి వర్షమై కురుస్తూ ప్రజలంతా సంతోషముతో పాడిపంటలతో సుఖంగా జీవించేలా చూస్తుంది. అందుకే డా సినారె గారు రాసిన "జీవన భాష్యం" గజల్ లో మబ్బు గురించి ఓ చక్కని షేర్ రాస్తారు." మబ్బుకు మనసే కరిగితే నీరవుతుంది" అని.. ఆ నీటిని అందరికీ పంచుతూ హెచ్చుతగ్గులు లేకుండా సమస్త జీవులను సమంగా చూస్తుంది. అందుకే మేఘాలను, మేఘాల నుండి వచ్చే వర్షాన్ని వాన దేవుడిగా వరుణుడిగా పూజిస్తారు.
ప్రభాతమే పరమాద్భుత చిత్రం అయితే ప్రభాత మేఘం మరింత అద్భుతమైనదన్న మాట.
మరి మన పెద్దవాళ్ళు ఈ "ప్రభాత మేఘ న్యాయము"ను ఉదాహరణగా చెప్పడానికి కారణం ఏమిటో చూద్దాం."మనిషి తన జీవితంలో పైసా ఖర్చు లేకుండా పొందాల్సిన ఆనందాన్ని,ఆత్మ విశ్వాసాన్ని వదిలేసి యాంత్రికంగా ఒక లాంటి నిరాశా నిస్పృహలతో బతుకుతున్నాడు. కాబట్టి నూతన ఉత్తేజం తెచ్చుకోవాలనీ చైతన్య వంతంగా సాగిపోవాలని చెబుతుంది.జీవన గమనం ఆనందమయం కావాలంటే ప్రభాతాన్ని, ప్రభాత మేఘాన్ని చూడమని తద్వారా స్ఫూర్తి పొందమని చెప్పారు".
కాబట్టి ఎంత హడావిడి జీవితం అయినా మనకోసం మనం కొంత సమయం కేటాయిద్దాం.నిత్యం నూతనోత్సాహ ప్రేరణ ఇచ్చే ప్రభాత మేఘాన్ని చూద్దాం. ఆనందభైరవి రాగం తీస్తూ ఆనందకరమైన జీవితాన్ని స్వంతం చేసుకుందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి