జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మరియు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబరు ఐదున జాతీయ స్థాయిలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించడానికి ఎంపికైన ఏభైమంది ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతల సంఘం జాతీయ అధ్యక్షుడు చౌధరి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమ్మన పురుషోత్తం, ఉపాధ్యక్షులు డి.ఎ.స్టాలిన్, కార్యదర్శి పారశెల్లి రామరాజు, కోశాధికారి కొప్పల సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కుదమ తిరుమలరావులు అభినందించారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన వీరికి సెప్టెంబర్ ఐదున న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృవపత్రం, ఏభైవేల రూపాయల నగదు పురస్కారంతో పాటు వెండిపూత పూసిన మెడల్ లను బహూకరిస్తారు. సెప్టెంబర్ నాలుగున వీరిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారి నివాసంలో అల్పాహారం ఏర్పాటు చేసి వీరితో ముచ్చటిస్తారు. జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయ వంటి పాఠశాలల నుండి ఆరుగురు, వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల నుండి నలభైనాలుగు మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మొత్తం ఏభైమంది
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుండి ఇద్దరు, తెలంగాణ నుండి ఇద్దరు ఎంపికైనారు. ఆంధ్రప్రదేశ్ నుండి మిద్దె శ్రీనివాసరావు (కృష్ణా జిల్లా), కుణతి సురేష్ (చిత్తూరు జిల్లా), తెలంగాణ నుండి పేసర ప్రభాకర రెడ్డి (ఖమ్మం జిల్లా), తాడూరి సంపత్ కుమార్ (సిరిసిల్ల రాజన్న జిల్లా) లు ఎంపికైనారని వీరు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్ జైన్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి