శ్లో :
గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రి శిఖరే
జలేవా వహ్నౌ,వా వసతు వసతేః కిం వద ఫలమ్
సదై యస్త్యై వాంతః కరణమపి శంభో తవ పదే
స్థితం చే ద్యోగోస్ సచ పరమ యోగీ స చ సుఖీ!
భావం:
ఓ శివా ! ఈ మనుజుడు యోగి అయి గుహలు యందు గాని,వెలుపల గాని,అడవి యందు గాని
పర్వతముల మీద గాని,జలమునందు గాని, అగ్ని
యందు గాని,నివారించవచ్చు. అందు వలన
ప్రయోజనము ఏమియు ఉండదు.అట్లుగాక ఎవరి
మనసు ఎల్లప్పుడూ నీ పాదపద్మముల యందు
నిలకడగా ధ్యానము కలిగి ఉండునో అతడే
ఉత్తమ యోగి కదా !
****
🪷శివానందలహరి🪷;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి