ఐదు సంవత్సరాల తర్వాత బడికి వెళ్లడం మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది ఆటల విలువ ఏమిటో తన తోటి పిల్లలతో హాయిగా చక్కగా ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆటల్లో నిమగ్నమైన క్షణాలు జ్ఞాపకం వస్తే ఎంత బాధగా ఉంటుంది కాలేజీలో చేరిన తర్వాత స్కూలులో చదువుకున్న రోజులు గుర్తుకు వచ్చి బాధపడడం ఏదైనా ఉద్యోగం వచ్చి అక్కడ చేరిన తర్వాత చదువు విలువ ఏమిటో తెలుస్తుంది ఆరోజు సక్రమంగా చదివి ఉంటే ఈరోజు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని బాధపడవలసి వస్తుంది ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఉద్యోగం విలువ ఏంటో తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యం మరణం పుట్టిన ప్రతి వాడు మరణించక తప్పదు కదా ఆ మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు తెలుస్తుంది జీవితం విలువ తల్లిని మించిన ఆప్యాయతతో జీవితాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ వచ్చిన భార్య విలువ ఆమె మరణించిన తర్వాత తెలుస్తుంది ఇది తెలుసుకున్నట్లయితే జీవితంలో ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో దానిని సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం.పెద్దలు ఏది చెప్పినా మంచి కోసం చెబుతాడు తప్ప ఏదో సాథిoచాలి అన్న అభిప్రాయంతో మాత్రం కాదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి వారు చెప్పిన దానివల్ల మనం కోపాన్ని తెచ్చుకోకూడదు ఏం చెప్తున్నారు వాళ్లు నీవు భోజనం చేసేటప్పుడు నీ శరీరంలో ఎంత జీర్ణశక్తి ఉందో నీవు ఎంత తింటే జీర్ణించుకోగలవొ అంతవరకే తిను అని చెప్పడం కోపంతో నా నీ జీవితానికి సరిపడిన సంపాదన ఉంటే నీ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అలా సరిపడా సంపాదించు అని చెప్పడం మంచిది కాదా సైకిల్ మీద గాని మోటార్ సైకిల్ మీద కానీ కారులో గాని వెళ్ళేటప్పుడు నీవు ఎంత కంట్రోల్ చేయగలవు అంత వేగంతోనే ప్రయాణించు లేకపోతే ప్రాణానికి మంచిది కాదు ఏ క్షణం అయినా ప్రమాదం జరగవచ్చు అని చెప్పడం నీ మంచికేగా అసలు జీవితంలో బాధలు ఎందుకు వస్తాయి పక్క వాడితో పోల్చుకునే వాడిలాగా జీవించలేకపోతున్నానే అన్న మాట మదన కనక ఎవరితోనో పోల్చుకోకుండా నిన్ను నీతోనే పోల్చుకుంటూ హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు కదా అన్నది పెద్దల సూక్తి.ఏ భాషలోనైనా ప్రతి మాటకు చక్కటి అర్థం ఉంటుంది మాటకు ఎంత విలువ ఉంటుంది అంటే ఒక మాట మాట్లాడితే చాలు ఎదుటి వ్యక్తుల మనసును కష్టపెట్టేలా ఉంటుంది మరేదైనా ఆహ్లాదకరమైన మాటలు చెప్పితే అవతల వాడి మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగుతుందో ఊహించలేం ఏదైనా చెడ్డ వార్త చెబితే అతని మనసు ఎంత బాధపడుతుంది బాధల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి కూడా ఈ మాటలే ఉపయోగపడతాయి అదే మాట అవతల వాడి మనసును ముక్కలు చేసేలా ఉంటుంది అలా చేసే అధికారం నీకు ఎక్కడిది కనుక మనం వాడే ప్రతి మాట కూడా అక్కడ సందర్భాన్ని బట్టి అవతలి వారి మనస్తత్వంని బట్టి వారి వయసును బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకో అంటారు పెద్దలు.
=====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి
=====================================
సమన్వయం ; - డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి