న్యాయాలు -595
పాషాణేష్టికా న్యాయము
*****
పాషాణం అంటే రాయి,గరళము, బండరాయి ,చట్రాయి, హాలాహలం, మందు, విషము.ఇష్టికా అంటే ఇటుక అని అర్థము.
ఇటుక రాయి (చట్రాతి కన్నా) బండరాయి కన్నా మృదువైనదే అని అర్థము.అంతే కదా ఇటుక ఇటుకే బండరాయి బండరాయే. ఇటుకను కరిగించవచ్చు. బండరాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కరగదు కాబట్టి బండరాయి కంటే ఇటుక మృదువైనదని అర్థము.
ఇక బండరాయి విషయానికి వస్తే అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో వ్యక్తి గురించో,బయటి మనుషుల గురించో ప్రస్తావిస్తూ వాళ్ళను బండరాయి/పాషాణంతో పోల్చి తిట్టడం మరియు విమర్శించడం వింటుంటాం.
అంటే విమర్శకు గురైన ఆ వ్యక్తి అత్యంత కఠినమైన హృదయం కలవాడనీ ఇవతలి వ్యక్తుల బాధ ఆవేదన, కష్టం,నష్టం చూసి కూడా చలించని వాడని అర్థము.
అందుకే అలాంటి వారి ముందు ఎవరైనా తమ బాధలు చెప్పుకొని సహాయం కోరాలని చూస్తే 'వాడొట్టి పాషాణంరా. నీవెంత చెప్పినా కరగడు'. "వాడితో చెప్పినా ఒకటే-'గోడతో చెప్పినా ఒకటే"అనడం వింటుంటాం.అలాగే "రాయి మీద నీరు నిలవదు- మొక్క మొలవదు అంటుంటారు.అంటే ఒకవేళ మార్చాలని చూసినా మారేవారు కారని భావం.
అలాంటి వ్యక్తుల్లో కొంత క్రౌర్యం, ఇతరులను హాని చేసే గుణం కూడా ఉంటుంది.అందుకే అలాంటి వారిని ఉద్దేశించి "నెమలికంటికి నీరు గారితే వేటగాడికి ముద్దా!" అనే సామెతతో పోలుస్తారు.
అలాగే మరికొందరు ఉంటారు.ఎలాంటి భయంకరమైన పరిస్ధితులను ఎదుర్కొన్నా తనవి కాదు అన్నట్లు ప్రవర్తిస్తుంటారు.వేటికీ చలించకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారిని "మంచి వార్తకు కష్టవార్తకు ఒకేరకంగా స్పందిస్తారని చెబుతూ వారిని"పాషాణేష్టికా న్యాయము" తో పోల్చి చెబుతుంటారు.
ఎందుకంటే ఇటుక చాలా నయం.ఎంత గట్టిగా వున్నా తేలికగా పొడి చేయవచ్చు, దానిలో పీల్చుకున్న తడిని చూడవచ్చు.అంటే ఇటుక లాంటి వ్యక్తి సాటి వారి సమస్యలకు చలిస్తాడు.దయ అనే ఆర్థ్రతతో తడుస్తాడు.అలాంటి వ్యక్తుల్లో కొంత మెత్తదనం ఉంటుంది.అంటే వారిలో హృదయ సంస్కారం కూడా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవచ్చు .
ఏది ఏమైనా మనం మనుషులం రాయి నయమా? ఇటుక రాయి నయమా ? అనేది కాదు. మనలో చలించే లక్షణం ఉండాలి.రాయిలా ఉండకూడదు. మనంతట మనం వెళ్ళి కదిలిస్తే ,సమస్యలు చెప్పుకుంటే దయతో ఇటుకలా తడవడమో మెత్త పడటమో కాదు. సానుభూతి,సహానుభూతి అనే సుగుణాలు ఉన్నప్పుడే అసలైన మనిషిగా జీవించగలం.అందుకే మన పెద్దలు"పాషాణేష్టికా న్యాయము"ను ఉదాహరణగా చెబుతూ అలా వుండటం మంచిది కాదని మనకు మనంగా గ్రహించేలా చేశారు .
కాబట్టి మనసున్న మనం మానవతా విలువలతో కూడిన జీవితాన్ని గడుపుదాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి