మత్తులో పడ్డాతేరుకోలేకున్నాఅక్షరాలకు చిక్కాఅంకితమైపోయాపదాలకు దొరికాబానిసనైపోయాఊహలకు తావయ్యాభ్రమలకు లొంగిపోయాకలముకు బందీనయ్యాగీతలు గీసేస్తున్నాకాగితాలు ఖైదీనిచేశాయిపంక్తులు పేర్పించుతున్నాయివిషయాలు తడుతున్నాయివిన్నూతనంగా విరచించమంటున్నాయికవిత కవ్విస్తుందిరాయకపోతే ఊరుకోనంటుందికైతలు పుట్టకొస్తున్నాయిపాఠకులకు పంపమంటున్నాయిపిచ్చి ముదిరినట్లుందిపుస్తకాలు ప్రచురించమంటుందిమైకం నుండిబయటకు రాలేకున్నాచిత్తయి పోతున్నాచెమటలు క్రక్కుతున్నాచిత్తాలు దోస్తున్నాచిరంజీవిని కావాలనుకుంటున్నామదిని చక్కబరచమనివాణీదేవిని వేడుకుంటున్నా
అదే పిచ్చి.. అదే యావ..;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి