ఎం. జి. రామచంద్రన్ ( ఎంజిఆర్ ) తన కార్యాలయ గదిలో అధికారుల కోసం నిరీక్షిస్తున్నారు. గది బయట ఎంజిఆర్ కి సన్నిహితులైన కొందరు అధికారులు ఒక్కటై ఆలోచిస్తున్నారు. కాస్సేపటికే వారు కొన్ని పేర్లను సిద్ధం చేసి అప్పటి ముఖ్యమంత్రి ఎంజిఆర్ కి ఇవ్వాలి. అదే అక్కడి ముమ్మర ఆలోచనకు ముఖ్యకారణం.
అది 1984.
కొడైకెనాల్ లో మహిళల కోసం ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నది ఎంజిఆర్ ఆలోచన. ఆయన కొన్ని పేర్లు అనుకున్నా అవేవీ ఆయనకు తృప్తినివ్వలేదు. దాంతో ఆయన ఆ విశ్వవిద్యాలయానికి ఏ పేరు పెట్టాలో సూచించవలసిందిగా అధికారులను ఆదేశించారు.
మొత్తానికి అధికారుల సమాలోచన ముగిసింది ముఖ్యమంత్రి గదిలోకి నెమ్మదిగా ప్రవేశించారు అధికారులు.
తాము రాసిన పేర్లను ఎంజిఆర్ కి ఇచ్చారు.
అవ్వయార్ పేరు పెట్టమని కొందరు సూచించారు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన తిల్లయాడి వల్లియమ్మయ్ పేరు పెట్టాలని మరి కొందరు సూచించారు.
ఇంకొందరు ఎంజిఆర్ తల్లి సత్య అమ్మయార్ పేరు పెడితే బాగుంటుందని సూచించారు.
ఇలా అధికారులు సూచించిన పేర్లన్నింటినీ చదివిన ఎంజిఆర్ తీవ్రంగా ఆలోచించిన తర్వాత చెప్పిన పేరు....
మదర్ థెరిసా!
ఎంజిఆర్ చెప్పిన పేరు విని అధికారులు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే అధికారులు రాసిన పేర్లలో మదర్ థెరిసా పేరు లేకపోవడమే వారి అయోమయానికి కారణమైంది.
అవును, ఎంజిఆర్ హృదయంలో నుంచి వచ్చిన పేరే మదర్ థెరిసా.
ఇలాగే ఏర్పడింది మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం.
Mother Teresa Women's University !
వేదికపైన ఈ పేరుని ఎంజిఆర్ ప్రకటించగానే హర్షధ్వానాలు మిన్నంటాయి.
వేదీకపైన ఎంజిఆర్ పక్కనే ఉన్న అలనాటి జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరుక్ అబ్దుల్లా లేచి నిలబడి ఎంజిఆర్ ని హత్తుకున్నారు.
హిందూ మతానికి చెందిన ఎంజిఆర్ క్రైస్తవ మతానికి చెందిన మదర్ థెరిసా పేరు విశ్వవిద్యాలయానికి పెట్టడంపట్ల ముస్లిం మతానికి చెందిన ఫరుక్ అబ్దుల్లా ఎంజిఆర్ ని మనసారా అభినందించారు.
ఇదే వేదికపైన ఉన్న మదర్ థెరిసా ఇదంతా మౌనంగా చూస్తున్నారు.
రాజకీయాలలో ఎంజిఆర్ కి ఆదర్శనీయుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై చెప్పిన మాట గుర్తుకొచ్చింది.
“ నేను కైలి (పొడవాటి వస్త్రం... పట్టుతో కానీ పత్తితో కానీ తయారు చేసినది ) ధరించని ముస్లింని. శిలువ ( క్రాస్ ) ధరించని క్రైస్తవుడిని. బొట్టు పెట్టుకోని హిందువుని.”
అన్నా చెప్పిన ఈ మాటలు తన జీవిత పాఠంగా స్వీకరించారు ఎంజిఆర్. ఆయన జీవితాంతం ఈ పాఠాన్ని ఆచరించారు.
ఇది గ్రహించిన మదర్ థెరిసా వేదిక మీదనే ఎంజిఆర్ ని హృదయ పూర్వకంగా ఆశీర్వదించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి