అంతర్జాల వేదిక ఆధారముగా అరుణోదయ సాహితివేదిక, సహస్రశోభ సమావేశాలు సంయుక్తంగాగురువారం నిర్వహించిన తెలుగు మహాసభలు చాలా దిగ్విజయం గా ముగిసాయి.
ఈ సమావేశానికి
ఏనుగు నరసింహారెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసిన ఈ సభలో,
ప్రముఖ సంస్థల సాహితీ వేత్తలు మేకరవీంద్ర గారు, పారుపల్లి కోదండ రామయ్య గారు,
డా.రామకృష్ణ చంద్రమౌళి గారు, డా. రాజగోపాల్ గారు, డా. ఘంటా మనోహర్ రెడ్డి గారు, డా కృష్ణారెడ్డి గారు, పాల్గొని తెలుగు భాషా విషయాల పై ఎంతో ప్రయోజనాత్మ కమైన విషయాలు తమ సందేశాల ద్వారా తెలియచేసారు.
దాదాపు 60 మంది పాల్గొన్న ఈ సమావేశంలో అనేకమంది కవులుతెలుగు బాష గురించి కవితా గాణం చేసారు.
అధ్యక్షు రాలు డా. అరుణకోదాటి తొలి పలుకులతో స్వాగతం పలుకగా, వసుమతి వీణా నాదం తో ప్రార్థనా గీతం ఆలాపనచేయగా p. మాసుoబి వ్యాఖ్యాత గా కార్యక్రమం కొనసాగింది.
దాదాపు 3-30 గంటలపాటు కొనసాగిన ఈ సమావేశం లో అనేకమంది తెలుగు బాష గురించి ప్రసంగించారు.
బిటవరం శ్రీమన్నారాయణ,శోభదేశ్ పాండే, G. రాజేంద్రప్రసాద్, చేపూరి JV. కుమార్ గారు Gk సూర్యనారాయణ, గుర్రం మల్లేశం, వి. మంజుల, B. రమాదేవి, Mv ప్రసాద్,సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మన్నారాయణ గారు సాంకేతిక సహకారం అందించగా, రాజేంద్రప్రసాద్ గారి ముగింపు వాఖ్యాలతో సభ ముగిసింది.
ముఖ్య అతిథి ఏనుగు నర్సింహా రెడ్డి గారికి అరుణోదయ సాహితీ వేదిక వ్యవస్థాపకురాలు, సభ అధ్యక్షురాలు ప్రత్యేకకృతజ్ఞతలు తెలిపింది.
పెద్దలకు, సాహిత్యవేత్తలకు, కవులకు, నిర్వాహకులకు సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియ చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి