ఒక ప్రక్కగా నిలబడి తథాగతుడు పరినిర్వాణం చెందాల్సిన సమయం ఆసన్నమైంది పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిన సమ్యక్ బుద్ధుడు పరినిర్వాణం చెందే సమయం ఇదే గతంలో ఒకసారి తథాగతుడు ఎంతవరకు భిక్షువులు భిక్షునీలు ఉపాసకులు నా శిష్యులు ధర్మాన్ని అర్థం చేసుకుని ఆ మార్గం లో నడుస్తారో వారి ఆచార్యుల దగ్గర వారు దీక్షతో నేర్చుకున్న ధమ్మన్ని ప్రతిష్టించి ప్రవచించి పరివ్యాప్తంగాలించి ప్రకటిస్తారో నిజంకాని నిజం కాని ఇతర సిద్ధాంతాలను వాదాలను ఖండించి నిజమైన అనితరమైన అద్భుతమైన ధమ్మాన్ని నిలబెడతారో అప్పటివరకు నేను పరి నిర్వాణo ను పొందనన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అని అయితే తధాగతులు అన్నట్లు అంతా జరిగింది కాబట్టి పరి నిర్వాణం చెందటానికి ఇదే అదును అని మారుడు పేర్కొన్నాడు.ఈ జీవితంలోనే మానవులందరూ ధర్మాన్ని అర్థం చేసుకొని పవిత్ర జీవనం గడపన0త వరకు నేను పరినిర్వాణం పొందను మారా అని గతంలో పలికిన బుద్ధుని మాటలు నిజమైనాయి కాబట్టి బుద్ధుడు పరి నిర్వాణం చెందడం మంచిదని మారుడు మరో మారు వేడుకున్నాడు ఇప్పటినుంచి మూడునాల్లకు తథాగతుడు పరి నిర్వాణం చెందబోతున్నాడు అని బుద్ధుడు మారునితో అన్నాడు సరిగ్గా అదే సమయంలో చాపాల చైత్యం లో ఉన్నప్పుడే బుద్ధుడు ఇకపై జీవించ రాదన్న నిర్ణయానికి వచ్చాడు ఆ సందర్భంగా భూమి కoపిoచింది అంతగా భూమి కనిపించడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఆనందా మహా భూకంపాలు పుట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి భూమి నీళ్లలో ఉంది నీళ్లు గాలిలో ఉన్నాయి గాలి ఆకాశంలో ఉంది పెనుగాలులు వీచిన సందర్భాలు ఉన్నాయి.
పెనుగాలులు వీచినప్పుడు నీటిలో ప్రకంపనలు పుడతాయి నీటిలో అలా పుట్టిన ప్రకంపనలు భూమిని కదిలిస్తాయి ఇది మొదటి కారణం అలాగే ఒక భిక్షువు గాని బ్రాహ్మణులు గాని అతేంద్రియ శక్తులు కలిగి మనసుని జయించడం వల్ల గాని లేక దేవతలు మిక్కిలి శక్తి సంపన్నులుగా ఉండడం వల్ల గాని భూమిని కoపిoప చేసే శక్తిని కలిగి ఉంటారు ఇందువల్ల కూడా భూమి కoపిoపవచ్చు ఇది రెండవ కారణం అలానే ఒక బోథిసత్తుడు సమృద్ధితో పూర్తిగా ఏరుకగలికి సంతుష్ట స్వర్గం నుంచి వెళ్లి గర్భంలో ప్రవేశించినప్పుడు భూమి కనిపిస్తుంది ఇది మూడవ కారణం ఇక భోధిసత్తులు స్మృతితో ఎరుకకలిగి తన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా భూమి కoపిస్తుంది ఇది నాలుగో కారణం
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి