చెరువు...
మన ఊరి బరువును మోసే ఆదరువు
చెరువు పక్కన వూరు
ఊరు పక్కన చెరువు
ఇదే మన బతుకు
వూరి పక్కన చెరువు లేకపోతే
వూర్ల బతుకు లేదు
చెరువుల చేపల లెక్క
వూర్ల మనుషులు మసలుతరు
ఆ చెరువు నీళ్ళు లేక
తెల్ల మొక మేస్తే చేపలెక్కడివి?
వూర్ల మనుషులెక్కడుంటరు?
సబ్బండ వర్ణాల బతుకు దెరువు చెరువు తోనె
దోసిలి లాంటి చెరువు
నేడు అడుక్కునే అరచేయి అయింది
చెరువు దీనత్వం
మన అలసత్వమే
అందుకే... మనమంతా కదిలి
భుజం భుజం కలిపి
చేతిలో చేయి కలిపి
మన చెరువుల్ని
కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం
చెరువు తల్లి గోస తీరుద్దాం
మనం
ప్రతి చెరువు పూడికను తీసేద్దాం
మనం
ప్రతి చెరువుని ఆదరువు చేసుకుందాం
ఇక మన చేతులు అడుక్కునే అరచేతులు కావు
దానం చేసి సేదదీర్చే నిండు దోసిళ్ళు!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి