తింటున్నరు;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆడపిల్లలు మేకప్ లతో 
టైమును తింటున్నారు
మగపిల్లలు పెళ్ళితో 
వరకట్నాలు తింటున్నరు
ఉద్యోగులు పనికి
లంచాలు తింటున్నరు
నాయకులు వచ్చిన
నిధులను తింటున్నరు
రైతులు అప్పులు తీరక 
పురుగు మందులు తింటున్నరు
సైనికులు శతృసేనల
తుపాకి గూళ్ళు తింటున్నరు 
మరి, ఎవరు అంటున్నరు?
జనం ఆకలితో ఛస్తున్నారని!!
**************************************

కామెంట్‌లు