సుప్రభాత కవిత -బృంద
నెలలు నిండిన నెలత
కళలు నిండిన వదనంలోని
కడుపులోని శిశువుకదలికలకు
వెలుగు వెన్నెల నవ్వు నింగిదేమో!

కడుపు పండిన కన్నబిడ్డను
కనుల నిండా చూసుకుంటూ
కలలపంట రాక కోసం వేచిన 
కన్న తల్లి ఆత్రం కానదేమో!

పురిటి నొప్పులు పడకనే
పుత్తడి బంతిని ప్రసవించి
పుడమి తల్లికి కానుకివ్వాలని
తూరుపు కొండల సంబరమేమో!

లోకం చీకటి తరిమేసి
కాంచన కాంతులు పరిచేసి
వేచిన మనసుకు వేకువనే
వేడుకివ్వాలని భానుడి తొందరేమో!

నిశులన్నీ నిన్నలంటూ
ఆశల ఆసరా అందిస్తూ
దిశల వెలుగుల నింపే రవికి
ఉష పలికే స్వాగతమేమో!

తృప్తి నిండిన మనసులా
స్వార్థం లేని కోరికలా
అహం లేని అభిమానంలా
నిర్మలమైన నింగికి కోటిరంగులద్దే

వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు