90 ఏళ్ల మహిళ గురించి ప్రస్తావనకు రాగానే మప మనస్సులో మెదిలే మొదటి విషయం ఏమిటంటే ఆవిడ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ మనవరాళ్లతో ఆడుకుంటూ, స్నేహితులు, బంధువులతో గడుపుతుందని అనుకుంటాం. ఏ వృద్ధుడి గురించో వృద్ధురాలి గురించో మనం ఆలోచించే తీరిది.
అయితే గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో 92 ఏళ్ల వృద్ధురాలి సహాయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈవిడ ప్రయాణీకులకు వారి సీసాలను మంచినీటితో నింపుతూ ఎంత చురుకుగా కన్పిస్తుంటారో మాటల్లో చెప్పలేం.
ప్రయాణీకులకు నీరివ్వడం ఎందుకు ప్రారంభించాలనుకున్నారని అడిగినప్పుడు, రైలు ఆగినప్పుడు ప్రయాణికులు నీటిని నింపడానికి గ్వాలియర్ స్టేషన్‌లో దిగుతారని, కొన్నిసార్లు, వాటర్ బాటిళ్లలో నీటిని నింపే క్రమంలో వారు తమ రైలుని మిస్సవుతారు. ప్రయాణీకులు విశ్రాంతి తీసుకోవడానికి వారి ప్రయాణాన్ని ఆస్వాదించడానికి వారికి తన వంతుగా ఏదయినా సహాయపడాలనుకునే ఆలోచనతో ఇది చేస్తున్నానని జవాబిచ్చారావిడ. ఆవిడ పేరు సరళా త్రిపాఠీ.
కలిసి ప్రయాణించే కుటుంబాలు విడిపోవడాన్ని ఆమె కోరుకోదు. ఎంత పెద్దవారైనప్పటికీ, ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతోనే క్షణక్షణం గడుపుతుంటారామె. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు. మనమూ ఇటువంటిదేదో మంచిపని చేయాలనిపిస్తుంది. సంకల్పం ఉంటే చాలు, ఎంతటి పనినైనా చేయడానికీ ఏ అడ్డంకినైనా అధిగమిస్తాం.
సరళా త్రిపాఠీ 1996 నుండి నిరంతరంగా ఇలా చేస్తున్నారు. సరళ ఉదయాన్నే స్టేషన్‌కు చేరుకుని రైలు ప్రయాణికులకు నీళ్లు అందిస్తూ ఆనందానుభూతి చెందుతారు. ఆమెను అమ్మమ్మ అని పిలుస్తారు. వయసు రీత్యా స్టేషన్‌కు వెళ్లకుండా ఆమెను చాలాసార్లు కుటుంబభ్యులు అడ్డుకున్న సందర్భాలున్నాయి. అయినా ఆవిడ తన పని మానలేదు.
ఆవిడ గురించి తన దృష్టికి రావడంతోనే ప్రధాని మోదీ ఎలా స్పందించారో చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ వేదికగా చేసుకుని మాట్లాడుతూ, "నా ప్రియమైన దేశప్రజలారా, ఈసారి భిన్నంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. మనమందరం భారతదేశ మహిళా శక్తిని, వారి విజయాలను జరుపుకుంటాము. ఆమె (సరళా త్రిపాఠి) భారతదేశ లక్ష్మి లాంటివారు. మనమందరం ఆమెను గౌరవించాలి. ఇటువంటి మహిళల కథలను మనం తప్పక చదివి వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ఈ భారత లక్ష్మిలందరికీ నేను గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సరళా త్రిపాఠిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి" అని అన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి