ఏ రోజుకా రోజు- జయా
ఈ ప్రపంచంలో
మనకైన దారిని
ఎన్నుకోవడానికి
అనేకానేక అవకాశాలు
ఉన్నాయి 

కానీ
అంత కన్నా 
ఎక్కువగా
అడ్డంకులూ ఉన్నాయి 
అనేదే వాస్తవం

కొన్ని నిముషాలపాటు
ఫోన్లో గేమ్ ఆడటానికి
999 అడ్డంకులు
దాటి గానీ గెలవలేం 

అటువంటప్పుడు
జీవితాన్ని
ఉట్టినే విడిచిపెట్టొచ్చా

ఏ రోజుకా రోజు
కొత్తదనమూ సవాలూ
అధిగమించడానికి
కృషి తప్పదు


కామెంట్‌లు