ఎర్ర ద్రాక్ష పళ్ళ గుత్తులు
కిందికి జారు చుండగా
రెండు పిల్లులు చూసాయి
ముద్దుగుచ్చి చేరాయి
శుభ్రంగా కూర్చుని
బుల్లి మారుజాలాలు
సుప్రభాత వేళలో
శుభోదయం పలికాయి
నేలపైన పుష్పాలు
వాటి పలుకులిన్నాయి
పూల రెక్కలు విప్పాయి
వీరబూసి నవ్వాయి
పొద్దటి సూర్యుడొచ్చాడు
కిరణాల మెరుపులలో
వాటిని చూసి మురిసాడు
ముద్దుగా ముద్దులు పెట్టాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి