న్యాయాలు-598
పీలు పత్ర ఫల న్యాయము
*****
పీలు అనగా బాణము, పరమాణువు,కీటము, ఏనుగు,తాటిచెక్క,ఒక పూవు, చెట్టు,పత్రము అనగా ఆకు.ఫలము అనగా పండు . పీలు పత్ర ఫల చెట్టు అనగా గొలుగు చెట్టు అని కూడా అర్థము వుంది.
గొలుగు చెట్టు ఆకులు చేదుగా,వగరుగా వుంటాయి కానీ పండ్లు మాత్రం తీయగా ఉంటాయి అని అర్థము.
అయితే ఈ గొలుగు చెట్టు గురించి కొన్ని విషయాలు నిజాలు తెలుసుకుందాము.
గొలుగు చెట్టు జాతిలో కనీసం 36 రకాలు ఉన్నయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఒక రకం కొండ గొలుగు చెట్టు. దీనినే కొండ గిలుగు,కొండ గుంజి అనే పేర్లతో పిలుస్తారు.ఈ చెట్టు అడవి పరిసర ప్రాంతాల్లో పెరుగుతుంది.ఈ చెట్టు గుబురుగా ఉన్న ప్రాంతంలో ఒక మీటరు ఎత్తులో పెరిగే మొక్క.దీని పూలు లేత పసుపు,తెలుపు రంగులో చిన్నవిగా ఉంటాయి.ఇవి వేసవి ప్రారంభ సమయంలో పూస్తాయి.వీటి పండ్లు లేత గులాబీ రంగులో ఉంటాయి.ఈ పండ్లు తీయని రుచి,నీరుగా వున్నప్పటికీ ఇవి విష పూరితమైనవని పల్లెవాసులు తినరు. ఈ పండ్లను పక్షులు మాత్రం ఎంతో ఇష్టంగా తింటాయట.
అయితే ఈ చెట్టు ఆకులను ఇతర దేశాల్లో ఔషధాలు, కషాయాల తయారీలో ఉపయోగిస్తారనీ,అలాగే ఈ మొక్క భాగాలను అధిక రక్తపోటు, ఉబ్బస వ్యాధి నివారణకు ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
మరి దీనిని కూడా మన పెద్దవాళ్ళు ఒక న్యాయంగా చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం.
"యథార్థ వాది లోక విరోధి" అన్నట్లు మంచి వారి మాటలు, పెద్దల హితోక్తులు వినడానికి ఎప్పుడూ చేదుగానే వుంటాయి.ఆచరించడానికి కష్టంగా కూడా వుంటాయి.
మరి అనారోగ్యాన్ని తగ్గించే ఔషదం కూడా అలాగే చేదుగా ఉంటుంది కదా!ఫలితం మాత్రం తీయగా వుంటుంది అంటే అనారోగ్యాన్ని తగ్గిస్తుంది.
ఇక పీలుపత్ర ఫలం చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి తీయని రుచిగా ఉంటుంది కానీ అది ప్రాణ హాని కలిగిస్తుంది.కాబట్టి "మెరిసేదంతా బంగారం కానట్టే" చూపులకు బాగున్నా తినడానికి పనికి రాదని గ్రహించాలి .
పీలు పత్ర ఫలముల వలె ఇతరులకు హాని కలిగించే వారి మాటలు కూడా వినడానికి ఎంతో తీయగా ఉంటాయి. రుచిగా ఉన్నాయని తింటే ఎలాంటి ప్రాణహాని కలుగుతుందో, అలాంటి దుష్టుల మాటలు వింటే కూడా అలాంటి ప్రమాదమే కలుగుతుంది.
కాబట్టి చేదుగా ఉన్నాయని శ్రేయోభిలాషుల మాటలను పెడచెవిన పెట్టొద్దు.తీయగా ఉన్నాయని దుష్టుల మాటలు విని ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దు.
ఇదే "పీలు పత్ర ఫల న్యాయము" వెనుక ఉన్న అసలు విషయం.కాబట్టి ఎవరు ఎలాంటి వారో ముందే హెచ్చరించే పెద్ద వాళ్ళ మాటలు విందాం. వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పిన మాటలను ఎల్లప్పుడూ గమనంలో పెట్టుకొని అపాయాలను అప్రమత్తతతో ఎదుర్కొందాం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి