స్వాతంత్ర్య గీతం;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అక్షరాలే గురువులు
అక్షరాలే విద్యార్ధులు
అక్షరాలే జ్ఞానం
అక్షరాలే విజ్ఞానం
ఇప్పుడు
ఆ అక్షరాలే రోడ్డుకెక్కినై 
తమ చుట్టూ జరుగుతున్న వివక్షను 
అక్షరాలా తూర్పారబడుతున్నాయ్ 
అక్షరాలై గర్జిస్తున్నాయ్
తమ సమాజానికి 
జాగృతగీతాన్ని అక్షరీకరించి
ఇప్పుడు రోడ్డుకెక్కినయ్
ఆటపాటలు, నినాదాలు,
జండాలు, బలిదానాలు, 
ఆత్మాహుతులు ఎన్నోరకాలుగా 
సబ్బండ వర్ణాలనేకంజేసినయ్
సకల జనులతో సమ్మెనుజేయించినయ్
న్యాయం కోసం సింహాలై గర్జిస్తున్నయ్ 
కలిసుండి కాలనాగులై పోరాడినదానికన్నా
విడిపోయి స్వేచ్ఛావిహంగాలు కావడం మిన్న 
అందుకే అక్షరోదయమైంది 
తెలంగాణ స్వాతంత్ర్యగీతం పాడుకుంది!! 
**************************************


కామెంట్‌లు
Ramakrishna Patnaik చెప్పారు…
అక్షరాలను కొనియాడిన విలక్షణ కవిత ఇది! మీ కలానికి నా సలాం!
-రామతాత!
అజ్ఞాత చెప్పారు…
Nice Sir ji