అలుపు లేక నడిచే దారిని
మలుపు మలుపులో మజిలీలు
తలపులోని గమ్యం వైపు
ఆగక సాగే గమనాలు
అసలు చదవని పుస్తకంలోని
అర్థం కాని ప్రశ్నలు
గెలవక తప్పని స్పర్ధలు
తలవని తలపే బ్రతుకులు
జరిగిపోతున్న కాలంలో
పరుగులు పెడుతూ
కరిగిపోతున్న ఆశలను
తరిగి పోనీని ఆత్రాలు
తమసులోకి జారనీక
తపసులెన్నో చేసాక
తలపులోని స్వర్గమేదో
తనివితీరగ అందునేమో!?
తూరుపు చూపే వెలుగులోన
దారులేవో వెదకి చూచి
కోరుకున్న తీరం వైపుకు
చేరుకునే ప్రయత్నమే జీవితం
అలసిపోనీక ఆదుకుని
ఆదరించి అనుగ్రహించి
అరమరికలు లేని ఆనందమిచ్చే
అపురూపమైన అవకాశమే రేపు.
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి