నువ్వే;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 ఓ జాబిలీ - నా నెచ్చెలీ
నీ కౌగిలే - నాలోగిలీ
!!ఓ జాబిలీ!!
పువ్వులలో నువ్వే - 
చక్కని నవ్వులలో నువ్వే
కన్నులలో నువ్వే - 
చల్లని వెన్నెలలో నువ్వే
!!ఓ జాబిలీ!!
నీ బుగ్గ మందారాలు - 
నీ సిగ్గు సింగారాలు 
నీ మనసు మకరందాలు - 
నామనసు కదియే చాలు
!!ఓ జాబిలీ!!
నీ మనసులో గమకాలు - 
నా తనువులో సరిగమలు
నీ పెదవి పల్లవి చాలు - 
నా మనసు పాటలు పాడు
!!ఓజాబిలీ!! 
**************************************


కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి పాట... చిన్నగా బాగుంది. 👌🌹🌹అభినందనలు సార్. 🙏