చార్మినారు ; - తుమ్మూరి రామ్మోహన్ రావు
రండి రండి చూద్దాము
చార్మినారు సొగసు 
హైద్రబాదు నగరానికి
అదే కదా శిరసు 

ప్లేగువ్యాధి నిర్మూలన
ధ్యేయానికి సంకేతం
కులీ కుతుబ్షాహి రాజు
దీ అపూర్వ సంకల్పం

నాలుగు స్తంభాలలోన
గుండ్రంగా మెట్లు
రెండంతస్తుల పైకి
ఎక్కి దిగేటట్లు

మూసీనది తూర్పు వైపు 
ఉన్నది ఈ కట్టడం
చుట్టూరా సందడిగా 
రకరకాల వ్యాపారం 

నగరానికి నడిబొడ్డున 
గర్వించే నిర్మాణం
చార్మినారు అంటేనే
భాగ్యనగర సంకేతం

కామెంట్‌లు