సుప్రభాత కవిత ; - బృంద
మౌనమైన మనసులో
రగులుతున్న ధ్యేయంలా
గాయమైన మనసులో
కదులుతున్న జ్ఞాపకంలా....

కలలు తీరని కలవరంలో
కలత తీరిన పులకరంలా
కనులు చూడని స్వప్నమేదో
కదిలి వచ్చే తరుణంలా.....

అలసిపోయిన మదికి 
అలుపుతీరిన భావనలా
అంతరంగాన దాచిన
అరుదైన రూపంలా.....

మనసు తాకిన మమతలేవో
మరలి వచ్చిన జాతరలా
మరపు రాని తలపులన్నీ 
తలుపు తట్టిన పిలుపులా

మురిసిపోయిన హృదయమేదో
ఎగసి తాకిన గగనంలా..
వదిలి పోయిన నేస్తమేదో
వెదకి చేరిన తరుణంలా....

పుడమి పిలుపు విని
తడవు చేయక తిరిగి చూసి
విడని చీకట్లు తొలగిపోయేలా
విడిది చేసి వెలుగుల వెల్లువై

వరములిచ్చే వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు