బుద్ధుని తొలి శిష్యుడు ఆనందుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 అందరికీ గౌతమబుద్ధుడు చిరపరిచితుడు కానీ ఆయన ప్రథమశిష్యుడు ఆనందునిగూర్చి అంతగా తెలీని వారు చాలా మంది ఉన్నారు.గౌతముని బాబాయి కొడుకు తన 37 వ ఏట బౌద్ధ సంఘంలో చేరాలని బుద్ధుని వేడాడు."రాజవంశం లో పుట్టిన నీవు సన్యాసి గా మారగలవా?"అన్న తథాగతుని ప్రశ్నకు" ఇప్పుడే సిద్ధం " అని ఆనందుడు తన 55వ ఏట ఆయన కి అనుంగు శిష్యుడు గామారాడు."భగవన్! మిమ్మల్ని చూడాలని వచ్చే వారికి నేనే స్వయంగా వారిని మీకు పరిచయం చేస్తాను.మీబోధనలు ప్రచారం చేస్తాను" అన్న ఆనందుని కోరిక నెరవేర్చాడు బుద్ధుడు.ఆనందుని పట్టుదల ప్రేరణ తోటే బుద్ధుడు తన భార్య యశోధరని ఇతర మహిళలను బౌద్ధ భిక్షుణులుగా మారటానికి అంగీకరించారు.బుద్ధుని నిర్యాణం తర్వాత ఆనందుడు కూడా తపశ్శక్తి తో బౌద్ధ మత గ్రంథం సుత్తపిటకంలో బుద్ధుని అనుగ్రహ ఉపదేశాల్ని జనాలకి అందించాడు.ధర్మపరిరక్షకుడు అని అందరిచే పిలువబడిన ఆనందుడు 120ఏళ్ల పండువయసులో తనువు చాలించారు.రాజగృహం రాజు వైశాలి యువరాజు ఆయన భక్తులు.వారి మధ్య నిలబడి తన ఆధ్యాత్మిక శక్తి తో పైకి లేచిన ఆకాశం వైపు సాగుతున్న ఆయన దేహాన్ని అగ్ని దేవుడు తన ఒడిలోకి తీసుకున్నాడు.పై నుంచి కిందకి రాలిన ఆయన శరీర అవశేషాలను ఆఇద్దరు పంచుకుని రాజ గృహం వైశాలి లో ప్రతిష్ఠించి వాటిపై స్థూపాలు నిర్మించారు బుద్ధుడు ఆనందుడు సమవయస్కులు కల్సి పెరిగిన వారు.అలా బౌద్ధ మత వ్యాప్తికి ధర్మ పరిరక్షణకు ఆనందుడు చేసిన సేవ అద్వితీయం🌷
కామెంట్‌లు