ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది
========================================
క్రొత్త వృత్తములు.
=============
66.
ఖేలాధ్యం - మ, స, మ.
గోవుల్ గాచిన గోపాలా నిన్
జీవుల్ భక్తిగ బిల్వన్ బ్రేమన్
గావంగా జను దెంచే శౌరీ!
నీవే నాప్రభు వయ్యా!కృష్ణా!//
67.
విశల్యం, ప్రమీల -య, య, య.
పరాకేల నయ్యా!ప్రభూ!సుం
దరా!నీదు సాన్నిధ్యమే ర
క్ష!రాజీవ నేత్రా!హరీ! శ్రీ
కరా!నన్ను పాలింపు!కృష్ణా!//
68.
రుక్మవతి -ర, త, మ.
సంపదల్ కోరంగ రానయ్యా!
ఇంపుగన్ నీరూప తేజంబున్
సొంపులన్ గాంచంగ నీ మ్రోలన్
బెంపుగన్ నే జేరితిన్ కృష్ణా!//
69.
విద్యా -స, జ, య.
పరమాత్మ!భక్తిగ గొల్తున్
గరుణాత్మ!చెంతను నిల్తున్
వరదా!భజింతును నిన్నే
శరణంబు కోరితి కృష్ణా!//
70.
సంబుద్ధి - స, త, య.
గిరిధారీ!వేగమె రావా!
మురళీలోలా!వినలేవా!
మొరలన్ శ్రీరంగనివాసా!
సురపూజ్యా!మాధవ!కృష్ణా!//
========================================
క్రొత్త వృత్తములు.
=============
66.
ఖేలాధ్యం - మ, స, మ.
గోవుల్ గాచిన గోపాలా నిన్
జీవుల్ భక్తిగ బిల్వన్ బ్రేమన్
గావంగా జను దెంచే శౌరీ!
నీవే నాప్రభు వయ్యా!కృష్ణా!//
67.
విశల్యం, ప్రమీల -య, య, య.
పరాకేల నయ్యా!ప్రభూ!సుం
దరా!నీదు సాన్నిధ్యమే ర
క్ష!రాజీవ నేత్రా!హరీ! శ్రీ
కరా!నన్ను పాలింపు!కృష్ణా!//
68.
రుక్మవతి -ర, త, మ.
సంపదల్ కోరంగ రానయ్యా!
ఇంపుగన్ నీరూప తేజంబున్
సొంపులన్ గాంచంగ నీ మ్రోలన్
బెంపుగన్ నే జేరితిన్ కృష్ణా!//
69.
విద్యా -స, జ, య.
పరమాత్మ!భక్తిగ గొల్తున్
గరుణాత్మ!చెంతను నిల్తున్
వరదా!భజింతును నిన్నే
శరణంబు కోరితి కృష్ణా!//
70.
సంబుద్ధి - స, త, య.
గిరిధారీ!వేగమె రావా!
మురళీలోలా!వినలేవా!
మొరలన్ శ్రీరంగనివాసా!
సురపూజ్యా!మాధవ!కృష్ణా!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి