మితవాది మాడపాటి;- - యామిజాల జగదీశ్
 ఆంధ్రులకు నాటి నిజాం ప్రభుత్వాధికారులు ఇచ్చిన బిరుదులు రూపుమాపి అనేక సంఘ శ్రేయోద్యమాలకు నారులు పోసిన ఆంధ్ర పితామహులు మాడపాటి హనుమంతరావు. కుందేచి పరుగుపై నమ్మకం లేని మాడపాటివారిది తాబేటి నడకే. ఆయమ కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కునూరులో జన్మించిన మాడపాటి వివిధ ఉద్యమాలలో ఆయనే కార్యకర్తే కాదు అన్నీనూ. ఆయనే సభ ఏర్పాటు చేసే వారు. ఆహ్వానాలకు చిరునామాలు రాయడం, పోస్టేజీ స్టాంపులు అతికించడం, సభ ముగిసిన తర్వాత పత్రికలకు వార్తలు రాయడం, నాంది మొదలుకుని భరతవాక్యం వరకు అంతా ఆయనే చేసేవారు. న్యాయవాద వృత్తిలో చాలా న్యాయంగా ఉండేవారు. ఆ వృత్తిలో ఆయన న్యాయంగానే రుసుము పుచ్చుకునేవారు. వారి సాహిత్యం సంఘ శ్రేయోపరమైన సాహిత్యం. చిన్ననాటినుంచే పోతన, అల్లసాని పెద్దన వారి కావ్యాలను ఇష్టపడి చదివేవారు. అయితే ఆయన ఓ సారి మాట్లాడుతూ, ఎప్పుడో చదివిన భాగవతం పద్యాలు తర్వాతి జీవితంలో అర్థమయ్యాయని చెప్పుకున్నారు. ఆయన ఉదయం పూట కచ్చితంగా ధ్యానం చేసే  వారు. గజేంద్ర మోక్షం తదితర ఘట్టాల పద్యాలు ఎనిమిదింటిని పదిసార్లు చదివేవారు.

కామెంట్‌లు