;సుప్రభాత కవిత బృంద
కలల రాత్రి గడచి
కనుల ముందు నిజమై
కల వరమై నిలిచెనదిగో
కనక కాంతుల వెల్లువై

వందనములిడు కరములు
బాష్పములూరు కనులు
భక్తిభావనతో వంచే శిరము
కృతజ్ఞత నిండిన హ్రదయముతో

పసిడి కలల జాతరలో
తప్పి పోయిన  మదిని
పట్టి తెచ్చి పదిలముగా
పాదసన్నిధిని నిలిపి ....

కరుణించిన పరమేశ్వరుని
కనుల నిండుగ దర్శించి
కదలి పోవు కాలమున
మిగిలి పోవు అనుభూతుల..

పోగుచేసుకుని మూటగట్టి
మనసు మూలన అట్టిపెట్టి
మరచిపోక మనమున 
మరి మరీ తాకి చూసుకుని

మురిసిపోవు తరుణమై
కురిసిపోవు కరుణయై
విరిసెనదిగో వినువీధిని
తెలిసి మనోరథము తీర్చ...

వేయి వెలుగుల రేడు
వేగిరముగ వేంచేసెనదిగో
వేడుకగ బ్రతుకును మార్చు
వెలుతురు పువ్వులు పంచుతూ..

🌸🌸 సుప్రభాతం🌸🌸

 

కామెంట్‌లు