వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
 కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అనేక రైళ్లు ఏర్పాటు చేసింది  ఒక్కొక్క రైలుకి ఒక్కొక్క పేరు పెట్టారు  ఆ పేర్లను ఆధారం చేసుకుని ఒక చిన్న హాస్య  సంభాషణ  భార్య భర్తతో అంటుంది ప్రయాణం బాగా జరిగిందా అని  ఏమని చెప్పేది బలే అవస్థ పడ్డా పద్మావతికి ట్రై చేశాను అసలు కుదరలేదు ఎంతో ట్రై చేశాను సరేనని  శబరికి ట్రై చేశా లాస్ట్ మూమెంట్ లో ఎలాగో దొరికింది  అనగానే భార్య మీ తీరే అంత ముందు చూపు లేదు అన్ని అప్పటికప్పుడే కిందటిసారి విజయవాడలో ముందే గౌతమ్ బుక్ చేసుకుని బాగానే ఎంజాయ్ చేశారు కదా అంటే ఏం చేయను మరి  నీకు ప్రశాంతి అంటే ఇష్టం ఉండదు అందుకనే ట్రై చేస్తే అప్పటికప్పుడు గౌతమి దొరికింది అనగానే మీరు ఎన్నైనా చెప్పండి నాకు మాత్రం శేషాద్రి అంటేనే ఇష్టం అనే రైళ్ల పేరుతో చక్కటి హాస్యాన్ని అందించిన జంట మీరూ ఆనందించండి.మానవ జీవితం చిత్రాతి చిత్రం  మన దగ్గర ఏది లేదో దానికోసం ఆరాటపడడం  ఆ తర్వాత నిరాశ నిష్పృహలకు లోను కావడం ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం  మన చేతిలో ఉన్న  ఏదైనా దాని విలువ తెలుసుకొని  సక్రమంగా వినియోగించినట్లయితే జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు అనేది మన శతకకారులు చెప్పే మాట    వారు చెప్పింది ఏది మన చెవులకు ఎక్కదు  మన చేతిలో డబ్బు ఉన్నప్పుడు దానిని ఎలా వినియోగించాలి  చిన్నవాడికి కొంచెం డబ్బులు ఇచ్చి చూడండి వాడు అవి ఖర్చు చేసే అంతవరకు   నిద్రపోడు  పెద్దదైన అంతే  చేతికి డబ్బు వచ్చినప్పుడు  దానిని ఎలా వినియోగించాలి అని ఆలోచించి  చివరి పైసా  ఖర్చు అయ్యేంతవరకు  మన పని మనం చేస్తూనే ఉంటాం.
జీవితంలో అమ్మను మించిన అమ్మ మరెవరైనా ఉంటారా  నీకు వివాహం అయిన తర్వాత  ఆ అమ్మ అడ్డుగా ఉంటుంది అని భార్య మాటలు విని  ఆమెను వృద్ధాశ్రమానికి పంపే వరకు నిద్రపోవు  ఆమె మరణించిన తర్వాత ఆ జ్ఞాపకాలు గుర్తుకొస్తే  అప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో దుఃఖపడుతూ ఉంటాం  అలాగే బాట చూపే తండ్రి  తనతో ముచ్చట్లు చెప్పుకునే చెల్లి తనను అదుపులో పెట్టే అక్క  మంచి సలహాలతో జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపే స్నేహితుడు  వీళ్ళు జీవించి ఉన్నంతవరకు వారి మాటలను మనం లెక్కచేయం వారిలో ఎవరైనా మరణించినప్పుడు  వారి జ్ఞాపకాలు మనకు గుర్తొచ్చి  ఏకాంతంగా కూర్చొని  గుండెల్లో బరువంతా తీరేంతవరకు  కన్నీరు కారుస్తూనే ఉంటాం.
=========================================
సమన్వయం . డా. నీలం స్వాతి 

కామెంట్‌లు